ఓదెల 2 ట్రైలర్.. తమన్నా సినిమాకు ఓ రేంజ్ బిజినెస్.. హీరోలు తలలెక్కడ పెట్టుకుంటారు..!
ఈ మధ్య శివుడి కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది దర్శకులు ఓం నమశ్శివాయ అంటూ కథలు రాసుకుంటున్నారు. మామూలుగా ఏ దేవుడి మీద సినిమా చేసిన కూడా చాలా క్లాస్ అనిపిస్తుంది..

ఈ మధ్య శివుడి కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది దర్శకులు ఓం నమశ్శివాయ అంటూ కథలు రాసుకుంటున్నారు. మామూలుగా ఏ దేవుడి మీద సినిమా చేసిన కూడా చాలా క్లాస్ అనిపిస్తుంది.. ఒక్క శివుడి మీద సినిమా తీసినప్పుడు మాత్రమే అది మాస్ కమర్షియల్ అంశాలతో ఉంటుంది. అది వర్కౌట్ అయితే ఎలా ఉంటుందో ఆఖండ సినిమాను చూస్తే అర్థమవుతుంది. అందుకే మిగిలిన దర్శకులు కూడా ఆ శివయ్య మీద కథలు బాగా రాసుకుంటున్నారు. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కూడా మెయిన్ దేవుడు ఆ శివుడే. తాజాగా తమన్నా కూడా ఆ శివయ్య నేపథ్యంలోనే సినిమా చేస్తుంది. అయినా దేవుడు, దయ్యం.. ఈ రెండు పదాలకు ఎలాగైతే ఎండింగ్ ఉండదో.. మన సినిమా కథలకు కూడా ఎండింగ్ ఉండదు. హారర్ జోనల్లో ఎన్ని సినిమాలు వచ్చిన ఆదరించడానికి రెడీగానే ఉంటారు ప్రేక్షకులు. అందుకే ఇప్పటికి ఆ తరహా సినిమాలకు డిమాండ్ ఉంటుంది. తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమా ఓదెల 2 ఇదే జోనర్ లో వస్తుంది.
ఆ మధ్య మహా కుంభమేళా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 2022లో ఆహాలో నేరుగా విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. కాకపోతే సీక్వెల్ కు సంపత్ నంది యాడ్ అవడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. దానికి తోడు తమన్న కూడా ప్రాజెక్ట్ లోకి రావడంతో మార్కెట్ మరింత పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూశాక సినిమాపై ఖచ్చితంగా అంశాలు పెరుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త కొత్త కాకపోయినా.. స్క్రీన్ ప్లే విషయంలో సంపత్ నందు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని టీజర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే అఖండ సినిమాకు లేడీ వెర్షన్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓదెల 2 ట్రైలర్. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ కు తోడు.. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ లో ఉంది.
తమన్నా కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఈమెను చూస్తుంటే అఖండ సినిమాలో బాలయ్యకు ఫిమేల్ వర్షన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. దేవుడికి దయ్యానికి మధ్య జరిగే కథ ఇది. ఫస్ట్ పార్ట్ కు లింకు పెట్టడమే ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ట సింహ ఇందులో కూడా కంటిన్యూ అయ్యారు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా బిజినెస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా కూడా దాదాపు 27 కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడం లేదు. అలాంటిది ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసింది అంటే చాలా పెద్ద విషయం. ఎలా చూసుకున్నా సంపత్ నంది ఈ సినిమాతో మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. చూడాలిక ఏం జరుగుతుందో..!