7 ఖండాలు… 1000 కోట్లు… 8 వింతలు… నో లిమిట్స్.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. కథేంటో, కథనం తోపాటు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో అఫీషియల్ గా మాత్రం తేలలేదు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. కథేంటో, కథనం తోపాటు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో అఫీషియల్ గా మాత్రం తేలలేదు. అన్నీ ఊహాగానాలే. లీకుల్ని బేస్ చేసుకునే అంతా అంచనాలు వేస్తున్నారు. చాలా వరకు అంచనాలే నిజమయ్యేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. ఐతే ఈమూవీ రిలీజ్ కి ముందే సెన్సేషన్ అయ్యేలా కనిపించటానికి కారణం ఇంతవరకు ఎవరూ చేయని పని రాజమౌళి చేస్తుండటం. ఏకంగా ఏడు ఖండాల్లో ఈ సినిమాను 100 లొకేషన్స్ లో తెరకెక్కించబోతున్నారు. వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ ఏడు వింతల్ని చూపించబోతున్నారు. ఆల్రెడీ ఆ పని తమిళ దర్శకుడు శంకర్ ఎప్పుడో జీన్స్ లో చూపించాడు. కాని రాజమౌళి అలా కాకుండా, అంతకుమించి ఏదో చేస్తున్నాడు. ఎనిమిదో వింతకి డోర్లు తెరవ బోతున్నాడు. ఆల్రెడీ అవతార్ ఫేం జేమ్స్ కామెరున్, జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్ లు ఈ సినిమాకోసం ఇండియా వస్తున్నారు… దీనికి తోడు డిస్నీప్ పిక్ఛర్స్, డ్రీమ్ వర్క్స్ లాంటి హాలీవుడ్ బ్యానర్లు ఈ సినిమాను 55వేల థియేటర్స్ లోరిలీజ్ చేసేలా డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.. అలాంటి సినిమాలో ఇప్పుడు ఏడు వింతలు, ఏడు ఖండాలు జాయిన్ అవుతున్నాయి…
సూపర్ స్టార్ మహేవ్ బాబు మూవీ ఎస్ ఎస్ ఎమ్ బీ 29 కి అన్ లిమిటెడ్ డేట్లు, అన్ కండీషనల్ కాల్ షీట్లు ఇచ్చేసింది హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఆల్రెడీ హైద్రబాద్, ఒడిస్సా షెడ్యూల్స్ లో మెరిసిన తను, కెన్యా షెడ్యూల్ కి ప్రిపేర్ అవుతోంది. ఐతే తన జీవితంలో ఎన్నడూ చేయని పని రాజమౌలఇ సినిమాకోసం చేస్తోంది. ఈ మూవీకి ఇన్ని డేట్స్ అని కాకుండా, ఎలాంటి కండీషన్స్ లేకుండా అన్ లిమిటెడ్ కాల్ షీట్స్ ఇస్తోందట. రాజమౌళి కూడా అన్ని షెడ్యూల్స్ కి అందుబాటులో ఉండేలా ఏడాదిన్న వరకు తన టైం ని పూర్తిగా లాగేసుకున్నాడట. ఇలాంటి కండీషన్స్ తో కొత్త కొత్త విషయాలు బయటికొస్తున్నాయి.ఏడు కండాల్లో షూటింగ్, ఏడు వింతల మ్యాటర్ బయటికొచ్చింది. బేసిగ్గా ప్రియాంక చోప్రా బాలీవుడ్ నటి.. కాని హాలీవుడ్ సినిమాలు చేస్తూ ఎప్పడు అక్కడ సెటిలైంది. నిక్ జోన్స్ తో పెళ్లి తర్వాత అమెరికానే అత్తిల్లైపోయింది.
అలాంటి తను ఏ సినిమా చేసినా, డేట్ల విషయంలో క్లియర్ గా ఉంటుంది. ముందుగానే డీల్ సెట్ చేసుకుంటుంది. ఇలా ఎప్పుడు పిలిచినా రావాలి, ఎన్ని డేట్లంటే అన్ని డేట్లు ఇవ్వాలనే కండీషన్ కి ఒప్పుకోదు. కాని ఒప్పేసుకుంది. రాజమౌళికి కండీషన్స్ లేకుండా ఎన్ని కావాల్సి వస్తే అన్ని కాల్ షీట్స్ ఇచ్చేసింది. దానికి కారణం ఈమూవీ ప్రపంచ ఏడు వింతలున్న ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవటం.
ఔను తాజ్ మహల్, చైనా గోడా, పీసా టవర్, ఈ మాచు పీచు,రోమ్ కొలొస్సియం, బ్రేజిల్ లో జీసస్ విగ్రహం ఇలా మొత్తంగా ఏడు ప్రపంచ వింతల దగ్గర మహేశ్ బాబు సినిమా షూటింగ్ ప్లాన్ చేశాడట. వాటి పర్మీషన్ ఇంతవరకు రాలేదు. తాజ్ మహల్ దగ్గర పర్మీషన్ ఎప్పుడో తీసేశారు. కాబట్టి నో ఛాన్స్..ఏదో మోదీజీతో ఉన్న చనువుతో, ఏదైనా స్పెషల్ పర్మీషన్ వస్తే చెప్పలేం.
అంతేకాదు ఆసియాలో 8 దేశాలు, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికాలతో పాటు, యూరప్, అలానే ఆర్కిటిక్, అంటార్కిటిక్ దగ్గరలో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. వీటీల్లో మంచు ధృవాల దగ్గర షూటింగ్ తేలిక కాదు. సో ఎంత ప్లాన్ చేసినా ఎప్పిటికప్పుడు లెక్కలు మారతాయి. కాబట్టే ఫిక్స్ డ్ కాల్ షీట్స్ కాకుండా కావాల్సి వస్తే, ఎప్పుడైనా అందుబాటులో ఉండేలా నటుల దగ్గర క్లారిటీ తీసుకున్నాడట రాజమౌళి. సో 1000 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ నిజంగా అన్ని ఖండాల్లో, అన్ని వింతల దగ్గర సినిమాతీస్తే అదే ఎనిమిదో వింతవుతుంది. శంకర్ కూడా జీన్స్ లో ఓ పాట కోసం ప్రపంచ వింతలు చూపించినా, కొన్నీంటిని దూరంగానే చూపించాడు. పాట వరకే పరిమితం చేశాడు. కాని రాజమౌళి అంతకుమించే సాహసం ఏదో చేస్తున్నాడు.