పెట్టుబడి 100 కోట్లు… టార్గెట్ 300 కోట్లు… అంచనా 500 కోట్లు..

నటసింహం బాలయ్య అఖండ 2 మూవీ ప్లానింగ్ పూర్తైంది. ప్రీప్రొడక్షన్ టైంలోనే ప్రీరిలీజ్ బిజినెస్ మీద రకరకాల అంచనాలు పెరిగాయి. ఐతే ఈ సినిమా పెట్టుబడి ముందుగా 60 కోట్లనుకున్నా, తర్వాత క్వాలిటీ పెంచటంతో పాటు, ప్రమోషన్ కోసమే 30 కోట్లు ఖర్చుచేయాలని

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 08:21 PMLast Updated on: Feb 13, 2025 | 8:21 PM

Investment 100 Crores Target 300 Crores Estimate 500 Crores

నటసింహం బాలయ్య అఖండ 2 మూవీ ప్లానింగ్ పూర్తైంది. ప్రీప్రొడక్షన్ టైంలోనే ప్రీరిలీజ్ బిజినెస్ మీద రకరకాల అంచనాలు పెరిగాయి. ఐతే ఈ సినిమా పెట్టుబడి ముందుగా 60 కోట్లనుకున్నా, తర్వాత క్వాలిటీ పెంచటంతో పాటు, ప్రమోషన్ కోసమే 30 కోట్లు ఖర్చుచేయాలని ఫిక్స్ అయ్యారు. అలా బడ్జెట్ మారింది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో అఖండ 2 తెరకెక్కబోతోంది. ఐతే ఇక్కడ 100 కోట్ల బడ్జెట్ పెట్టుబడైతే, ఫిల్మ్ టీం టార్గెట్ మాత్రం 300 కోట్లే పెట్టుకుందట. వందకోట్ల పెట్టబడి, 100 కోట్ల షేర్, 100 కోట్ల లాభం.. మొత్తంగా 300 కోట్లతో సరిపెట్టుకోవాలనుకుంటోంది. కాని ప్రీరిలీజ్ బిజినెస్ అంచనాలు చూస్తే మతిపోతోంది. రిలీజ్ కి ముందే 500 కోట్ల లెక్కలు తేలేలా ఉన్నాయి. శాటిలైట్, ఓటీటీ రైట్స్ 200 కోట్ల డీల్ ఆల్ మోస్ట్ ఓకే అయ్యిందని తెలుస్తోంది. ఓవర్ సీస్ తో పాటు 5 భాషల్లో థియేట్రికల్ రైట్స్ మరో 250 కోట్లు లెక్కలు తేలుస్తున్నాయి… ఇది కాకుండా మరో 50 కోట్లు సినిమాలో కొన్ని యాడ్స్ కి కేటాయించారట… ఫస్ట్ టైం ఇంతవరకు ఏ పాన్ ఇండియా మూవీలో చేయని యాడ్స్ ని ఇందులో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అదెలాగో చూసేయండి.

బాలయ్యకి ఇంతవరకు పాన్ ఇండియా హిట్ పడలేదు. అఖండ 2 తో ఆ వెలితి తీరేలా ఉంది. 100 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు, 300 కోట్లు మాత్రమే టార్గెట్ గా పెట్టుకుంది ఫిల్మ్ టీం. మరీ అత్యాశకు పోవట్లేదు. కాని సీన్ చూస్తే వద్దన్నా వందలకోట్లు వచ్చేలా ఉన్నాయి. 100 కోట్ల పెట్టుబడితో తెరకెక్కబోయే అఖండ 2 టార్గెట్ 300 కోట్లే అయినా, వసూళ్ల అంచనాలు మాత్రం 500 కోట్లను రీచ్ అయ్యేలా ఉన్నాయి.బాలయ్య పెర్ఫామెన్స్…ఈ మధ్య బాలయ్యసినిమాల స్టామినా చూస్తే.. తెలుగులోనే మినిమమ్ 150 కోట్ల వసూళ్లు తనకి కామన్ అయ్యాయి. వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, ఢాకూ మహారాజ్, అఖండ అన్నీ యావరేజ్ గా 140 కోట్ల నుంచి 150 కోట్ల వరకు వసూల్లు రాబట్టాయి. కాబట్టి అఖండ 2 హిట్ అయితే తెలుగులో ఈజీగా 150 కోట్లు రావటం ఖాయం.

ఇక మిగిలింది, హిందీ, తమిళ, మలయాళ మార్కెట్లు, ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ తోపాటు, ఓవర్ సీస్ మార్కెట్లు… కేవలం ఈ మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్సే 200 కోట్లకు డీల్ సెట్ అయినట్టే అనితెలుస్తోంది. మహాశివరాత్రికి టీజర్ తోపాటు ఓటీటీ సంస్థ ఎనౌన్స్ మెంట్ కూడారాబోతోంది.ఇక నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్, సౌత్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా 200 కోట్లు పలికేలా ఉన్నాయి… మిగతా భాషల రైట్స్ ఓవర్ సీస్ రైట్స్ తోకలిపితే 50 కోట్లని తెలుస్తోంది. అలా చూసినా ప్రీరిలీజ్ బిజినెస్ 450 కోట్ల వరకు ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఐతే మహింద్ర వేహికిల్స్, అలానే మాజా జ్యూస్ తోపాటు, టూర్స్ అండ్ ట్రావెల్స్ తాలూకు చాలా కంపెనీల యాడ్స్ సినిమాలోనే అంతర్లీనంగా ప్లాన్ చేస్తున్నారట.

సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు, నార్త్ ఇండియా లొకేషన్స్ తాలూకు సీన్స్ లో భారీ హోర్డింగ్స్ పెట్టి, అలా యాడ్స్ రూపంలో డబ్బు రాబడుతోంది అఖండ 2 మార్కెటింగ్ టీం. ఇది కొత్త స్ట్రాటజీ కాదు కాని… పాన్ ఇండియా లెవల్లో మాత్రం ఓ సినిమా ఇలా మూవీలోనే యాడ్స్ కంటెంట్ ని పెట్టి 50 కోట్లు రాబట్టడం ఇదే మొదలు.