CINEMA VS IPL: సవ‌తి పోరు.. సినిమాకు ఐపీఎల్ దెబ్బ.. భ‌య‌ప‌డుతున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు

ఈసారి ఐపీఎల్.. జ‌నాల్ని ఊహించిన దానిక‌న్నా ఎక్కువ‌గా అట్రాక్ట్ చేస్తోంది. ఐపీఎల్ ఫీవర్ జ‌నాల్లో ఎక్కువ‌గా ఉంది. ఇదంతా చిన్న సినిమాల ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు సంక‌టంగా మారింది. ప్రతిసారి ఐపీఎల్.. సినిమాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2024 | 02:09 PMLast Updated on: Mar 29, 2024 | 2:53 PM

Ipl 2024 Effect On Movies Low Collections For Hit Movies Due To Ipl

CINEMA VS IPL: మ‌న దేశంలో జ‌నాల‌కు బాగా కిక్కిచ్చేవి రెండే రెండు.. అవి ఒక‌టి క్రికెట్. రెండు సినిమా. ఈ రెండూ కలిస్తే కాంబినేష‌న్ సూప‌ర్ హిట్టు. ఒక‌టిదానిని మ‌రొక‌టి ఢీకొట్టాయా.. ఇంకొక‌టి క‌చ్చితంగా ఫ‌ట్టు. అందుకే ఈ రెండింటి మ‌ధ్య పోటీని స‌వ‌తి పోరుతో పోలుస్తారు. ఇప్పుడు ఇదే జ‌రుగుతోంది. సవతి పోరు ఎలా ఉంటుందో సినిమా రంగానికి బాగా తెలిసొస్తోంది. ఈ స‌మ్మ‌ర్‌లో నిజంగానే తెలుగు సినిమాకు స‌వ‌తిపోరు మొద‌లైంది.

Vishwambhara: 30 ఏళ్ల త‌ర్వాత చిరు-కీరవాణి కాంబో.. సంగీతం ఎలా ఉండబోతుందంటే.

ఈ పోరు సినీ ద‌ర్శ‌క నిర్మాత‌లకు చుక్క‌లు చూపిస్తోంది. ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్.. జ‌నాల్ని ఊహించిన దానిక‌న్నా ఎక్కువ‌గా అట్రాక్ట్ చేస్తోంది. ఐపీఎల్ ఫీవర్ జ‌నాల్లో ఎక్కువ‌గా ఉంది. ఇదంతా చిన్న సినిమాల ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు సంక‌టంగా మారింది. ప్రతిసారి ఐపీఎల్.. సినిమాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. ఈసారి కూడా అదే జ‌ర‌గ‌బోతున్న‌ట్లు సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో టీమ్స్ అన్నీ సై అంటూ బ‌రిలోకి దిగుతూ.. నువ్వా-నేనా అంటూ యుద్ధ‌మే చేస్తున్నాయి. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ు చూసేందుకు జ‌నం పిచ్చెక్కిపోతున్నారు. దానికి తోడు జియో సినిమాలో ఫ్రీ స్ట్రీమింగ్ ఇవ్వడంతో ప్ర‌తి ఆట‌కు స‌గ‌టున ప‌దిహేను కోట్ల‌కు పైగానే వ్యూస్ వ‌స్తున్నాయి. ఇదంతా కలెక్షన్లకు కుంపటిగా మారింది. ముఖ్యమైన మ్యాచులున్న ప్రతిసారి థియేటర్లు వెలవెలబోతున్నాయి. వీక్ డేస్‌లోనూ స్ట్రాంగ్‌గా ఉండాల్సిన ఓం భీమ్ బుష్‌పై దీని ఎఫెక్ట్ బాగా ప‌డింది. అటు.. టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. వాటిపైనా ఎఫెక్ట్ ప‌డిన మాట మాత్రం వాస్త‌వ‌మంటున్నారు.

మ‌రోవైపు ఏప్రిల్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఫ్యామిలీ స్టార్ వస్తోంది. దీని మీద పెద్ద ఎత్తున పెట్టుబడులున్నాయి. మ‌రో వైపు రౌడీ హీరో నాన్ స్టాప్ ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. మరో వైపు టిల్లు స్క్వేర్ కనక సక్సెస్ అయితే ఈ రెండూ బాక్సాఫీస్‌కి రిలీఫ్ ఇస్తాయంటున్నారు. అయితే.. ఇంకోపక్క ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతుండటంతో జనాల దృష్టి అటు కూడా డైవ‌ర్ట్ అవుతోందన్న ఆందోళ‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. అంతదాకా స్టార్ హీరోలకు ఇబ్బంది ఉండదు. కానీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు మాత్రం చిక్కులు, చికాకులు తప్పేలా లేవ‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పబ్లిక్ మూడ్ ఇలా డివైడ్ అయిపోవడం కంటెంట్ ఉన్న సినిమాల మీద ఎఫెక్ట్ ప‌డుతోంద‌ని.. ప‌బ్లిక్‌లో ఇదే మూడ్ కంటిన్యూ అయితే న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చిన్న సినిమాల ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు.