Krithi Shetty : కృతిశెట్టి జాతకం మారిపోయింది..
సౌత్ లో బేబమ్మ జాతకం మళ్లీ రైజ్ అవుతోందా.. ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ పెరగడానికి కారణమేంటి.. శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా.. ఒకేసారి రెండు 100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో కృతికి ఛాన్స్ రావడం ఆశ్చర్యమే. ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతిశెట్టి. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో.. తన క్రేజ్ పెరిగింది. తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో గోల్డెన్ లెగ్ అయిపోయింది.

Is Bebamma's horoscope rising again in the south.. What is the reason for the increase in offers like Krithi Shetty who has not had any success for a year?
సౌత్ లో బేబమ్మ జాతకం మళ్లీ రైజ్ అవుతోందా.. ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ పెరగడానికి కారణమేంటి.. శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా.. ఒకేసారి రెండు 100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో కృతికి ఛాన్స్ రావడం ఆశ్చర్యమే. ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతిశెట్టి. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో.. తన క్రేజ్ పెరిగింది. తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో గోల్డెన్ లెగ్ అయిపోయింది. కానీ తర్వాతే బ్యాడ్ టైం బాదేసింది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాప్‌లతో కృతిశెట్టి క్రేజ్ ఒక్కసారిగా కరిగిపోయింది. కొత్త ఆఫర్స్ ఇచ్చేందుకు మేకర్స్ ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. దీంతో టాలీవుడ్‌కి కామా పెట్టిన కృతి.. ఇప్పుడు మల్లూవుడ్, కోలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఒకేసారి రెండు 100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చింది. మలయాళంలో అజయంతే రాండాం మోషనం అనే సినిమాలో నటిస్తోంది. దీని బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉంది. అలాగే తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న జీనీలో కళ్యాణి ప్రియదర్శన్‌తో కలసి నటిస్తోంది కృతి శెట్టి. దీని బడ్జెట్ కూడా 100 కోట్లు. అలాగే కార్తితో వా వాతియారే సినిమాలో నటిస్తోంది. ఈ మూడు సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. కంటెంట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ రెండు సినిమాలు హిట్ అయినా.. సౌత్‌లో కృతి శెట్టి క్రేజ్ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ లక్కీ ఛాన్స్‌ని ఈ బ్యూటీ ఎంతవరకు