షాకింగ్.. బిగ్ బాస్ 9 తెలుగు హోస్ట్ మారుతున్నాడా.. నాగార్జున రీప్లేస్మెంట్ ఎవరు?
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే నాగార్జుననే. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్.. రెండో సీజన్ నాని చేసిన తర్వాత.. మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోను టేకోవర్ చేశాడు. మొదట్లో నాగార్జున హోస్టింగ్ గురించి కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా..

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ అంటే నాగార్జుననే. మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్.. రెండో సీజన్ నాని చేసిన తర్వాత.. మూడో సీజన్ నుంచి నాగార్జున ఈ షోను టేకోవర్ చేశాడు. మొదట్లో నాగార్జున హోస్టింగ్ గురించి కాస్త నెగటివ్ టాక్ వచ్చినా కూడా.. ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయాడు మన్మధుడు. నాలుగో సీజన్ నుంచి ఈయన హోస్టింగ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు నాగార్జున అంటే బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటే నాగార్జున అనేలా మారిపోయింది పరిస్థితి. సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఈ షో కోసం తీసుకుంటున్నాడు నాగ్. సీజన్ సీజన్ కు రెస్పాన్స్ గా పెరుగుతూ పోతుండడంతో స్టార్ మా కూడా నాగార్జున రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. షోను ఈయన నడిపిస్తున్న తీరు చూసిన తర్వాత.. ఇప్పట్లో హోస్ట్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకున్నారంతా. స్క్రిప్ట్ విషయాల్లో కూడా చాలా పక్కాగా ఉంటాడు నాగార్జున. అంతేకాదు షోకు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. కంటెస్టెంట్స్ ఎవరు ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటాడు.
అంతేకాదు వీకెండ్ ఎపిసోడ్ కు నాగార్జున చేసే హోస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 9 తెలుగుకు నాగార్జున ఉండడు అని తెలుస్తుంది. కొత్త సీజన్ కొత్త హోస్ట్ తో మొదలవుతుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే మొదలు కాబోయే బిగ్ బాస్ 9 ను నాగార్జున కాకుండా మరో హీరో పోస్ట్ చేయబోతున్నాడు అని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. బిగ్బాస్ సీజన్ మొదలయ్యే ముందు ప్రతిసారి ఇలాంటి రూమర్స్ కామన్ అనుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం విషయం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. నిజంగానే ఈసారి నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నాడని.. కావాలనే ఆయన బ్రేక్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈయన ప్లేస్ లో బాలకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా రాబోతున్నట్టు ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. ఒకప్పుడు బాలయ్య హోస్ట్ అంటే కొత్తగా అనిపించేదేమో కానీ.. ఆహాలో ఆయన చేసిన అన్ స్టాపబుల్ షో చూసిన తర్వాత బాలయ్య హోస్టింగ్ మీద ఎవరికి అనుమానాలు లేవు.
పైగా ఆయన బిగ్ బాస్ లోకి వస్తే రేంజ్ ఇంకా పెరుగుతుంది అంటున్నారు అభిమానులు. నాగార్జునను కాస్త మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా.. బాలయ్య హోస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. జూన్ నుంచి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ.. ధనుష్ కుబేర సినిమాలతో బిజీగా ఉన్నాడు నాగార్జున. దీని తర్వాత తన 100వ సినిమా మీద ఫోకస్ పెట్టమన్నాడు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ కు కాస్త గ్యాప్ ఇవ్వాలని చూస్తున్నాడు నాగార్జున. అందుకే బాలకృష్ణ వైపు అడుగులు వేస్తున్నారు షో నిర్వాహకులు. నాగార్జున హోస్టింగ్ డామినేట్ చేసే రేంజ్ లో ఉండాలి అంటే.. ఆయన్ని మించిన హోస్ట్ ను పట్టుకోవాలి. అందుకే బాలకృష్ణ వైపు చూస్తున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే బాలయ్య హోస్టింగ్ ఈ షోకు ఎంతవరకు హెల్ప్ కానుంది అనేది చూడాలి.