దేవర సైలెంట్ గా టాలీవుడ్ ను వదిలేస్తున్నాడా…? అంత కోపం ఎందుకు…?

దేవర సినిమా ఎవరికి ఏం చెప్పిందో తెలియదు గాని... ఎన్టీఆర్ కు మాత్రం చాలా నేర్పింది. ఎవరిని నమ్మవద్దు అనే విషయాన్ని ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నాడు. అవును దేవర సినిమా విషయంలో ఏ టూ జెడ్ దేవర మాత్రమే కష్టపడ్డాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 11:43 AMLast Updated on: Nov 02, 2024 | 11:43 AM

Is Devara Silently Leaving Tollywood

దేవర సినిమా ఎవరికి ఏం చెప్పిందో తెలియదు గాని… ఎన్టీఆర్ కు మాత్రం చాలా నేర్పింది. ఎవరిని నమ్మవద్దు అనే విషయాన్ని ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నాడు. అవును దేవర సినిమా విషయంలో ఏ టూ జెడ్ దేవర మాత్రమే కష్టపడ్డాడు. ప్రమోషన్ విషయంలో గాని, సినిమాను ఇతర భాషల్లో సక్సెస్ చేసే విషయంలో గాని ఎక్కువగా ఎన్టీఆర్ ఎఫర్ట్ ఉంటుంది. బాలీవుడ్ లో తనకు ఉన్న స్నేహాలతో దేవరను బాగా ప్రమోట్ చేసుకున్నాడు. కన్నడం విషయంలో కూడా ఒక పక్కా ప్లానింగ్ తో వెళ్లి సక్సెస్ అయ్యాడు.

అక్కడి స్టార్ హీరోలతో ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది. ఇక కన్నడ డబ్బింగ్ కూడా ఎన్టీఆర్ స్వయంగా చెప్పడం అక్కడి వాళ్లకు చాలా బాగా నచ్చింది. ఇక తమిళంలో మాట్లాడుతూ… అక్కడి డైరెక్టర్ వెట్రిమారన్ తో డైరెక్ట్ గా ఒక తమిళ సినిమా చేసి దాన్ని తెలుగులో డబ్ చేస్తా అంటూ చెప్పడాన్ని తమిళ జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగులో దేవర పెద్దగా సీరియస్ ప్రమోషన్స్ ఏం జరగలేదు అనే చెప్పాలి. ఇతర భాషలతో పోలిస్తే ఇక్కడి మీడియాకు కూడా ఫార్మల్ గానే ఎన్టీఆర్ మాట్లాడటం మనం చూసాం.

దేవర డిజాస్టర్ టాక్ వచ్చినా సరే మౌత్ టాక్ తో సక్సెస్ అయింది కూడా. ఇక్కడ దేవర ఒక్క విషయాన్ని చాలా గట్టిగా టాలీవుడ్ కు తొడకొట్టి చెప్పాడు. మీరు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు అని ప్రూవ్ చేసాడు. దేవరను కావాలని టార్గెట్ చేస్తున్నా వేరే హీరోలు సపోర్ట్ చేయకపోవడం ఎన్టీఆర్ కు అసలు నచ్చలేదు. అందుకే ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ ను లైట్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. వార్ 2 సక్సెస్ అయిన తర్వాత ఇతర భాషల్లో డైరెక్ట్ గా సినిమాలు చేయొచ్చు అని టాక్.

సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ను, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాను ఎన్టీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బాలీవుడ్, శాండిల్ వుడ్ లో ఎక్కువగా రిలీజ్ చేయాలని… హిందీ, కన్నడ, తమిళంలో ఒకేసారి షూట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. వార్ 2 సక్సెస్ అనేది ఎన్టీఆర్ ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్. అనుకున్నది జరిగింది అంటే మాత్రం కచ్చితంగా టాలీవుడ్ ను సైలెంట్ గా పక్కన పెట్టడమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అందుకే తన సినిమాల్లో కూడా ఇతర భాషల నటులనే తీసుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో తెలుగు నటులు చాలా తక్కువ అని టాక్.