దేవర 2 మూవీ నిజంగా సాధ్యమా? కేవలం ఇది త్రిబుల్ ఆర్ సీక్వెల్ లా నామమాత్రము ప్రాజెక్టేనా? ఈ డౌట్లన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వి కావు ... టాలీవుడ్ సినీ జనాల అనుమానాలు కూడా కావు.. ఇవి పూర్తిగా బాలీవుడ్ హీరోల, డిస్ట్రిబ్యూటర్ల డౌట్లు... అంత ఖచ్చితంగా చెప్పటానికి కారనం, కొరటాల శివకి ఈమధ్య ఏకంగా నలుగురు హీరోల నుంచి కాల్స్ వచ్చాయి... ఆ నలుగురు కొరటాల శివని కామన్ గా అడిగిన ప్రశ్న దేవర 2 ఉందా? లేదా? ఉంటే ఎప్పుడు? విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టించుకోవాల్సిన విషయం మీద, బాలీవుడ్ హీరోలకు అంత ఆత్రం ఎందుకు? ఈ డౌట్ కి సాలిడ్ రీజన్ ఉంది. ముంబై ముదుర్లు సక్సెస్ కి షార్ట్ కట్ కావాలంటున్నారు. దానికి దేవర 2 అడ్డుపడేలా ఉందట. ఆ అడ్డు తొలిగించుకోవటానికే ఈ ముందుజాగ్రత్తలని తెలుస్తోంది. ఎన్నో పాన్ ఇండియా సినిమాలుండగ, ఎందరో పాన్ ఇండియా హీరోలు పోటీ ఇస్తుండగా, హిందీ హీరోలకి దేవర 2 తో ఏం పని? చూసేయండి. దేవర 2 నిజంగా ఈ ఏడాదే మొదలౌతుందా? అసలు సీక్వెల్ ఉందా లేదా? ఉండే అవకాశం ఎంత..? ఈ డౌట్లు రాకముందే చాలా సార్లు కొరటాల శివ దేవర2 ప్రిపరేషన్స్ మొదలయ్యాయని తేల్చాడు. కథ సిద్దమైందన్నాడు. డ్రాగన్ తో ప్యార్ లల్ గా లేదంటే, డ్రాగన్ సగం పూర్తయ్యాక దసరాకు ఈ సినిమా షూటింగ్ మొదలవ్వొచ్చని ప్రచారం కూడా జరిగింది కట్ చేస్తే ఇప్పుడు దేవర 2 ఉంటుందా? లేదా ? ఉంటే ఎప్పుడు అన్న ప్రశ్నలు హిందీ హీరోలు వేస్తున్నారు. ఈ డౌట్లు వాళ్లకెందుకు వచ్చాయో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. వాళ్లకి అర్జెంట్ గా కొరటాల శివతో ప్రాజెక్టు కావాలి... హిందీ హీరోలకి హిట్ మెట్లెక్కడం ఎలాతో అర్ధం కావట్లేద. అప్పడప్పడు స్త్రీ 2 లాంటి హిట్లు తప్ప స్టార్ హీరోలకి అక్కడ సక్సెస్ అంటే మొఖం వాచిపోయున్నారు. ఏదో షారుఖ్ కి వచ్చిన పటాన్, జవాన్ లాంటి హిట్లు తప్ప గత పేదళ్లుగా చెప్పుకోదగ్గ హిట్లే లేవక్కడ. జవాన్, పటాన్ లో పటాన్ హిట్ వెనక వంద అనుమానాలున్నాయి. జవాన్ సక్సెస్ వెనక తమిళ దర్శకుడు ఆట్లీ హస్తముంది.. ఎలా చూసినా హిందీ హీరోలకి హిట్ కావాలంటే తెలుగు లేదంటే, తమిళ దర్శకుల తో సినిమా చేయాల్సిందే... యానిమల్ తో రణ్ బీర్ కపూర్ కి ఇదే విషయం అర్ధమైంది. రణ్ బీర్ కే కాదు, షాహిద్ కపూర్ కి కూడా హిందీలో హిట్ ఇచ్చింది సందీప్ రెడ్డి వంగనే. అందుకే ప్రశాంత్ నీల్, కొరటాల శివ, సుకుమార్ కోసం హిందీ హీరోల ప్రయత్నలు పెంచారు కాని ప్రశాంత్ నీల్ డ్రాగన్ తోపాటు, సలార్2 కి కమిటయ్యాడు కాబట్టి రెండున్నరేళ్ల వరకు తను ఖాలీగా ఉండే ఛాన్స్ లేదు. సుకుమార్ 8 నెల్ల తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు కాబట్టి, కనీసం తను 3 ఏళ్ల వరకు మరో హీరోకి అందుబాటులో ఉండటం కష్టం ఎలా చూసినా దేవర తో హిట్ మెట్టెక్కిన కొరటాల శివనే ఈజీగా దొరికేలా ఉన్నాడు. అందుకే రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ తోపాటు అజయ్ దేవ్ గన్ నుంచి కూడా కొరటాల శివకి కబురు అందిందట. వీళ్లు తనతో మాట్లాడినప్పుడు దేవర 2 గురించే వాకబు చేశారని, అది నిజంగానే పట్టాలెక్కేలా ఉంటే, వాల్లు వేయిట్ చేయక తప్పదని తేలింది.. మొత్తానికి ఇలా కూడా దేవర2 మీద హిందీ హీరోలు ఎంక్వైరీ చేయటం చాల విచిత్రంగా ఉందనే మాటే వినిపిస్తోంది. [embed]https://www.youtube.com/watch?v=pqDe10WUBNE[/embed]