Pawan Kalyan: ఏకంగా పవన్ తో యుద్దం..?
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో హరీష్ శంకర్ యుద్దం చేస్తున్నాడా? కనిపించని శక్తిని రంగంలోకి దింపాడా? పవర్ మీద ప్రెజర్ పెంచేందుకు బ్రహ్మాస్త్రం వాడాడా? టేకేలుక్

Is director Harish Shankar playing games with Pawan Kalyan regarding Ustad Bhagat Singh movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గేమ్స్ ఆడే సాహసం ఏ దర్శక నిర్మాత చేయడు. కాని డైరెక్టర్ హరీష్ శంకర్ ఏకంగా పవన్ తోనే పెట్టుకుంటున్నాడా? ఆ డౌట్ రావటానికి కారణం పవన్ మీద కొత్తగా రూమర్లు పెరగటమే.
ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. సగం పూర్తైన ఓజీనే పొంగల్ కి రిలీజ్ అవుతుందని ఫిల్మ్ టీం తేల్చలేదు. కాని కేవలం 5 రోజులు షూటింగ్ జరుపుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం సంక్రాంతికి వస్తుందట. అదెలా సాధ్యం. మొన్నటి వరకేమో పవనే పిలిచి తనకి బల్క్ గా డేట్లిస్తానన్నట్టు మీడియాకు లీకులిచ్చాడట హరీష్ శంకర్.
ఇప్పుడు తన టీం మెంబర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి రిలీజ్ అనేలా ట్వీట్లు, మీడియాకు లీకులివ్వటంతో, ఇది పవన్ మీద ప్రెజర్ పెంచటమే అంటున్నారు. ఉస్థాద్ భగత్ సింగ్ విషయంలో పవన్ నుంచి రెస్పాన్స్ లేదు. ఒకవైపు పాలిటిక్స్, మరో వైపు ఓజీ హడావిడి.. సో ఈ రెండీంటితో సతమత మవుతున్న పవన్, ఉస్తాద్ భగత్ సింగ్ తో సంక్రాంతికి సందడి చేయాలంటే, ఆగకుండా 90 రోజులు షూటింగ్ తో బిజ కావాలి.. కాని ఏపీ లో ఎన్నికల హడావిడి షురూ అయ్యేలా ఉంది. ఇలాంటి టైంలో ఉస్తాద్ షూటింగ్ కి ఛాన్ ఎంత అంటే నో ఛాన్స్ అంటున్నారు. కాని హరీష్ శంకర్ కి ఓపిక లేక, పరోక్షంగా పవన్ మీద ప్రెజర్ పెంచే ప్రయత్నాలు రూమర్లు, ఫీలర్ల రూపంలో వదులుతున్నాడనే కామెంట్స్ పెరిగాయి.