1000 కోట్ల గోతి తవ్వుకుంటున్నాడా..? ఐకానిక్ షాక్..

ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి పుష్ప2 తో హిట్ పడ్డా, 1800 కోట్ల పైనే వసూల్ల వరదొచ్చినా, ఆ సక్సెస్ సంతోషం దక్కలేదు. త్రివిక్రమ్ ఆల్రెడీ కథ సిద్దం చేసినా ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు. డైరెక్టర్ ఆట్లీ అందుబాటులో ఉన్నా, కథా చర్చలు జరిగినా ఆ సినిమా సెట్స్ పైకెళ్లట్లేదు. ఇక్కడ సమస్య బన్నీకి దర్శకులు, కత్తిలాంటి కథలు అందుబాటులో లేకపోవటం కాదు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 09:00 PMLast Updated on: Feb 25, 2025 | 9:00 PM

Is He Digging A 1000 Crore Gothi Iconic Shock

ఐకాన్ స్టార్ అల్లు అర్ఝున్ కి పుష్ప2 తో హిట్ పడ్డా, 1800 కోట్ల పైనే వసూల్ల వరదొచ్చినా, ఆ సక్సెస్ సంతోషం దక్కలేదు. త్రివిక్రమ్ ఆల్రెడీ కథ సిద్దం చేసినా ప్రాజెక్ట్ పట్టాలెక్కట్లేదు. డైరెక్టర్ ఆట్లీ అందుబాటులో ఉన్నా, కథా చర్చలు జరిగినా ఆ సినిమా సెట్స్ పైకెళ్లట్లేదు. ఇక్కడ సమస్య బన్నీకి దర్శకులు, కత్తిలాంటి కథలు అందుబాటులో లేకపోవటం కాదు… అసలు సమస్య కన్ ఫ్యూజన్ లో ఐకాన్ స్టార్ పడటం… జైలర్ డైరెక్టర్ తో పాటు ఆట్లీ, త్రివిక్రమ్ అంతా కథలు, సిద్ధం చేసుకున్న బన్నీ మాత్రం సిద్ధంగా లేడు. ఇప్పుడప్పట్లో సిద్ధపడేలా లేడు. ప్రభాస్, ఎన్టీఆర్ లా పాన్ ఇండియా లెవల్లో మరోసారి 1000 కోట్ల హిట్ కొట్టాలనుకుంటున్నాడు. హిట్ ఇచ్చిన డైరెక్టర్ సపోర్ట్ లేకుండానే, కొత్త దర్శకుడితో మరోసారి పాన్ ఇండియా హిట్ కావాలనకుంటున్నాడు. కాకపోతే 1000 కోట్ల మోజుతో, 1000 కోట్ల గోతి తవ్వుకునేలా ఉన్నాడనంటున్నారు. ఎందుకు? హావేలుక్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేయాలో క్లారిటీ మిస్ అయ్యిందన్నారు. పుష్ప 2 హిట్టైనా సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ తర్వాత తనకి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. హిట్ మూవీ సెలబ్రేషన్స్ కి దూరమయ్యాడు. ఇప్పుడు అంతకంటే పెద్ద ఇబ్బందిని ఫేస్ చేస్తున్నాడు.పుష్ప1 తర్వాత పుష్ప2 వచ్చింది కాబట్టి హిట్టైంది… ఇక మీదట తను చేసే సినిమా తోనే తన అసలు సత్తా బయట పడుతుంది. ఎందుకంటే బాహుబలి1, బాహుబలి 2 తర్వాత మూడు ఫెడ్యూర్స్ ఫేస్ చేశాకే ప్రభాస్ కి సలార్, కల్కీ లాంటి బ్లాక్ బస్టర్లొచ్చాయి. రాజమౌలి సాయం లేకుండా తనేంటో పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకోగలిగాడు.

ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ తర్వాత దేవర హిట్ తోనే రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియాని శాసించగలనని ప్రూవ్ చేసుకున్నాడు. చెర్రీ మాత్రం ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ లతో ఇంకా స్ట్రగులింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు.. ఇప్పుడు బన్నీ వంతొచ్చింది.పుష్ప ఎంత గొప్ప హిట్టైనా కారనం సుకుమారే… బాహుబలి, త్రిబుల్ ఆర్ సక్సెస్ కి మొదటి కారనం రాజమౌళి అన్నది ఎంత నిజమో, పుష్ప హిట్ కి సుకుమారే కారణం అన్నది అంతే నిజం. పుష్ప వల్ల వచ్చిన ఇమేజ్ తో పుష్ప2 విషయంలో బన్నీ క్రేజ్ ఈ సీక్వెల్ కి 1800 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ఉండొచ్చు.. కాని ఇప్పుడు సుకుమార్ లేకుండా సొంతంగా పాన్ ఇండియాని బన్నీ షేక్ చేయాలి..

లేదంటే చరణ్ లా డీలా పడాల్సివస్తుంది. అలా చేద్దామంటే సుకుమార్, రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనకరాజ్,ప్రశాంత్ నీల్, కొరాటాల శివ ఇలా పాన్ ఇండియా దర్శకులంతా బిజీ. సరే హిందీలో జవాన్ తో 1000 కోట్ల హిట్ ఇచ్చాడని ఆట్లీతో మూవీ ప్లాన్ చేస్తే, గీతా ఆర్ట్స్ లో దర్శకుడి రెమ్యునరేషన్ సమస్యైంది. సరే సన్ పిక్చర్స్ తో ఆట్లీ ప్లాన్ చేసిన మూవీ చేద్దామంటే, అక్కడ 250 కోట్ల తన పారితోషికం ఇబ్బందిగా మారేలా ఉంది. ఆట్లీ తో అనుకున్న సినిమాకు కథ సిద్దంగా ఉందట. త్రివిక్రమ్ తో మూవీ అనుకుంటే ఆ సినిమాకు స్క్రిప్ట్ రెడీగా ఉందట. కాని మాటల మాంత్రికుడి మీదబన్నీకి నమ్మకంతక్కవయ్యేఆట్లీతోప్రాజెక్టుపట్టాలెక్కించాలనుకుంటున్నాడట. కాని అక్కడ ఆట్లీ రెమ్యునరేసన్ డిమాండ్స్ ఇవన్నీచూస్తే హీరోకి 200 కోట్లిచ్చి, ప్రొడక్షన్ హౌజ్ చాలా కండీషన్లు పెడుతోందట. దీంతో పాన్ ఇండియా హిట్లు, ఇమేజ్ ఉన్నా ఎటు వెళ్లాలో బన్నీకి తేలట్లేదనంటున్నారు. ఏదైనా ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఇలాంటి సెటైరికల్ కామెంట్లు కామన్.