Ram Potineni: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శిష్యుడిగా ఉస్తాద్ రామ్
ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా ఎలివేట్ అయిన రామ్, ఇప్పుడు బన్నీకి శిష్యుడిగా మారాడు. అల్లు అర్జున్ అడుగు జాడల్లో నడవాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకి బన్నీ బాటలో రామ్ నడవటానికి కారణమేంటి? జస్ట్ వాచ్ ఇట్.

Is hero Ram Pothineni following icon star Allu Arjun's formula..that's why he is making a film under Boyapati's direction.
అల్లు అర్జున్ అడుగు జాడల్లో నడవటంలో బిజీ అయ్యాడు ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్. బోయపాటి శీను మేకింగ్ లో తను చేసిన స్కంద విషయంలో యాజ్ ఇట్ ఈజ్ బన్నీ రూట్లోనే వెళుతున్నాడట రామ్. ఆవిషయంలో బన్నీ దేశముదురు, సరైనోడు సినిమాలతో రామ్ మూవీలకు పోలీకలు పెడుతున్నారు
నిజానికి బన్నీ లవర్ బోయ్ నుంచి మాస్ హీరోగా మారటానికి కారణం పూరీ జగన్నాథ్ తో తను చేసిన దేశముదురే. అలా మాస్ ఇమేజ్ వచ్చాక బన్నీని ఫుల్ ఫెడ్జ్ డ్ మాస్ స్టార్ గా మార్చింది మాత్రం బోయపాటే. అది కూడా సరైనోడితో. ఏకంగా హిందీ డబ్బింగ్ వర్షన్ కి మిలియన్ల కొద్ది యూట్యూబ్ లో వ్యూస్ వచ్చేలా చేసింది కూడా సరైనోడే. అలా పుష్ప కంటే ముందే బాలీవుడ్ జనానికి ఐకాన్ స్టార్ మీద భారీ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు రామ్ వంతొచ్చినట్టుంది.
ఎలాగైతే బన్నీ ని పూరీ మాస్ హీరో గా మార్చాడో, రామ్ ని కూడా ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మార్చాడు. ఎలాగైతే బన్నీకి సరైనోడితో బోయపాటి కలిసొచ్చాడో, అలానే ఇప్పుడు రామ్ తో బోయపాటి శీను స్కంద మూవీ తీశాడు. ఈ పోలికలు చూస్తుంటే, మాస్ మార్కెట్ మీద పట్టుకోసం అచ్చంగా రామ్ కూడా బన్నీ లానే పూరీ దారిలో నడుస్తూ, బోయపాటి మేకింగ్ లో మెరస్తూ వస్తున్నాడు. ఇది వర్కవుట్ అయితే, ఫార్ములా బానే అచ్చొచ్చిందనుకోవాల్సిందే.