Gaami Review : మాస్ మెంటల్ భయ్యా.. విశ్వక్ కుమ్మేశాడు…!

టాలీవుడ్ లో టైంలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు సాలిడ్ గా పెరిగి పోగా ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన గామి సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో రివ్యూలోకి ఎంటర్ కావాల్సింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2024 | 12:14 PMLast Updated on: Mar 08, 2024 | 12:14 PM

Is It Mass Mental Gami Movie Review

ఇంట్రో..
టాలీవుడ్ లో టైంలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు సాలిడ్ గా పెరిగి పోగా ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన గామి సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో రివ్యూలోకి ఎంటర్ కావాల్సింది.

స్టోరీ లైన్…
మనిషి స్పర్శ తాకితే చనిపోయే వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి ఆ వ్యాధి నివారణ కోసం చేసిన ప్రయాణమే గామి. తనకు వచ్చిన అరుదైన సమస్యను తగ్గించుకునేందుకు హీరో హిమాలయాలకు వెళ్తాడు. ద్రోణగిరి పర్వాతాలలో 36 ఏళ్లకి ఒకసారి స్వయం ప్రకాశితం అయ్యే పాణిపత్రాలు ద్వారా నయం అయ్యే అవకాశం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. హీరోకి సైమల్ టేనియస్ గా మరో 2 ఉపకథలు సాగుతాయి. మరీ తన ప్రయాణంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు. చివరు ఆ ప్రాణిపత్రాలు సంపాదించుకున్నాడా లేదా అన్నదే అసలు కథ.

పర్పామెన్స్…

గామి సినిమాలో అఘోరాగా విశ్వక్ యాక్టింగ్ అదుర్స్ అనిపించింది. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడు, తన యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ రోల్ కి తగ్గట్లు మెప్పించగా చాందిని చౌదరి కూడా తన రోల్ వరకు బాగా నటించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ పరిది మేరకు పర్పాలేదనిపించుకున్నాడు.

సాంకేతిక విభాగం
కొత్త దర్శకుడు విద్యాధర్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఫ్లాట్ గా అనిపించినా కూడా చాలా చోట్ల ఎంగేజింగ్ గా ఉంది, సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వీఎఫ్ఎక్స్ తో ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా యూనిక్ గా ఉండగా… సంగీతం పర్వాలేదు అనిపించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ లెంట్ గా ఉంది. బీజీఎం, లాస్ట్ ట్విస్ట్, లయన్ ఎపిసోడ్.. తో పాటు కొన్ని సీన్స్, సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

ఓవరాల్ గా మొత్తం మీద సినిమా ఫ్రెష్ స్టొరీ పాయింట్. రెగ్యులర్ మూవీస్ చూసి చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ అనిపిస్తోంది. సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది