ఆయనకి లైఫ్ ఇచ్చేది ఎన్టీఆరే..? 1000 కోట్ల కోసం ఆ హీరో.

రాజమౌళి తో ప్యార్ లల్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ లానే, కేజీయఫ్ ఛాప్టర్ 1, చాప్టర్ 2 తో పాన్ ఇండియాని షేక్ చేశాడు ప్రశాంత్ నీల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2025 | 09:00 PMLast Updated on: Apr 15, 2025 | 9:00 PM

Is It Ntr Who Gives Him Life That Hero For 1000 Crores

రాజమౌళి తో ప్యార్ లల్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ లానే, కేజీయఫ్ ఛాప్టర్ 1, చాప్టర్ 2 తో పాన్ ఇండియాని షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. అలాంటి ఈ దర్శకుడు సలార్ 2 హ్యాట్రిక్ కిక్ ఇచ్చాక, డ్రాగన్ తో బిజీ అయ్యాడు. ఎన్టీఆర్ ని డ్రాగన్ గా మారుస్తున్నాడు. ఈనెల 22 నుంచి సెట్లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడు. అటు 2 పాన్ ఇండియా హిట్లున్నా మాస్ హీరో ఎన్టీఆర్, ఇటు మూడు పాన్ ఇండియా హిట్లున్న దర్శకుడు ప్రశాంత్ నీల్… వీళ్ల కాంబినేషన్ లో సినిమా అంటే 1000 కోట్ల వసూళ్లు మ్యాటరే కాదు. పాన్ ఇండియా అనే డిస్కర్షనే అవసరం లేదు. అంతగా పూనకాలు తెప్పించే ఈ సినిమాకో అంతకుమించి సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. హిందీ హీరో రణ్ వీర్ సింగ్ ని ఇందులో స్పెషల్ రోల్ లో తీసుకోబోతున్నారని తేలింది. అప్పటి నుంచి తను ఈమూవీకి ఎలా ప్లస్ అవుతాడనే కంటే, గతకొంతకాలంగా హిట్లే లేని తనకి ఎన్టీఆరే 1000 కోట్ల ఆఫర్ తెచ్చిపెట్టాడనే డిస్కర్షన్ జరుగుతోంది. బాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా హిట్లకు, తెలుగు టాప్ స్టార్లు షార్ట్ కట్ గా మారారనే మాటే వినిపిస్తోంది.

కేజీయఫ్ ఛాప్టర్ 1, చాఫ్టర్ 2 తర్వాత సలార్ ఇలా వరుసగా 3 పాన్ ఇండియా హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి తన డైరెక్షన్ లో రెండు పాన్ ఇండియా హిట్లు మాత్రమే కాదు, రాజమౌళి సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసిన హీరో కాబట్టి ఇలాంటి స్టార్ తో ప్రశాంత్ నీల్ డ్రాగన్ లాంటి ప్రాజెక్ట్ తీస్తే, అది సెన్సేషన్ అవుతుంది.

ఇవి అందరూ అంచనా వేసేదే…ఈజీగా ఎవరికైనా అర్ధమయ్యేదే.. కాని డ్రాగన్ మూవీ వల్ల ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కంటే మరో హీరో ఎక్కువ బెనిఫిట్ పొందేలా ఉన్నాడు. తనే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. ఏదో కెరియర్ బిగినింగ్ లో తనకి బాలీవుడ్ లో హిట్లు పడొచ్చు కాని, పాన్ఇండియా లెవల్ బ్లాక్ బస్టర్ అంటేఏంటో తనకి తెలియదు.దీనికి తోడు కొన్నేళ్లుగా తన సినిమాలన్నీ ప్లాపులు డిజాస్టర్లవుతున్నాయి. అలాంటి తనకి 1000 కోట్ల హిట్ పడితే ఎలా ఉంటుంది…? అదే డ్రాగన్ వల్ల జరగబోతోంది. ఫస్ట్ టైం తను ఓ పాన్ ఇండియా మూవీ, అందులోనూ తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. డ్రాగన్ లో పోలీస్ పాత్ర వేయబోతున్న తను, గెస్ట్ రోలే కాని 15 నిమిషాల నిడివిఉన్న పాత్రలో కనిపించటం కన్పామ్ అయ్యింది

జులై 6న తన బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని తేలింది. విచిత్రం ఏంటంటే కొన్నేళ్లుగా హిట్ ముఖం చూడని తనకి, డ్రాగన్ లో గెస్ట్ రోల్ వేయటం వల్ల, తొలి పాన్ ఇండియా హిట్ పడే ఛాన్స్ఉంది. అదే జరిగితే ఎన్టీఆర్ ఇద్దరు బాలీవుడ్ హీరోల ఫేట్ మార్చిన వాడవుతాడు..ముందుగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కి పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉన్నాడు ఎన్టీఆర్. వార్ 2 మూవీ లో ఎన్టీఆరే లేకపోతే, అది ఎంత బాగున్నా బాలీవుడ్ లోనే ఆడే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా హిట్ అయ్యే అవకాశాలం ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెసే…

సో వార్ 2 మూవీ ప్రీరిలీజ్ బిజినెస్సే 1200 కోట్లు దాటడంతో, ఓరకంగా హ్రితిక్ కి కూడా 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడమే కాదు, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ముందే కన్ఫామ్ అయ్యింది. అలానే డ్రాగన్ లో రణ్ వీర్ సింగ్ స్పెషల్ రోల్ వేస్తే, అది కూడా హిట్ అవటానికే 99 శాతం ఛాన్స్ ఉంది కాబట్టి, తనకి 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే అవకాశం దక్కినట్టౌతుంది. ఒకప్పుడు సౌత్ హీరోలంటే వాళ్ల పేర్లే తెలియనట్టు ప్రవర్తించే హిందీ హీరోలకి, పాన్ ఇండియా హిట్ కావాలంటే తెలుగు నటసింహాలే సాయం చేసే పరిస్థితి వచ్చింది.