ఎన్టీఆర్ ని మించడం ఉత్తదేనా… 300 కోట్ల వెనక 150 కోట్ల గ్యాస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ అని మొన్నటికి మొన్న, తెగ వార్తలొచ్చాయి. దానికి కారణం ఆట్లీ మూవీకి తను 175 కోట్ల పారితోషికం తీసుకోవటమే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2025 | 09:20 PMLast Updated on: Apr 02, 2025 | 9:20 PM

Is It Possible To Surpass Ntr 150 Crore Gas After 300 Crore

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ అని మొన్నటికి మొన్న, తెగ వార్తలొచ్చాయి. దానికి కారణం ఆట్లీ మూవీకి తను 175 కోట్ల పారితోషికం తీసుకోవటమే. నిజానికి ఇదేం పెద్ద నెంబర్ కాదు. ప్రబాస్ ఆదిపురుష్ కే 200 కోట్లు తీసుకున్నాడన్నారు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ కి 75 కోట్లు పారితోషికంగా, 75 కోట్లు ప్రాఫిట్ లో షేర్ తీసుకున్నాడన్నారు. ఇదే నెంబర్ చరణ్ కి వర్తిస్తుందనే అభిప్రాయముంది. దేవరకి ఏకంగా 200 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్, వార్ 2 కి 250 కోట్లు తీసుకుంటూనే, డ్రాగన్ మీద 300 కోట్ల బాంబు వేశాడు.. ఇన్ని నెంబర్స్ వినిపిస్తుంటే, ఒకవైపు ప్రభాస్ రెమ్యునరేషణ్ పరంగా 500 కోట్ల క్లబ్ లో చేరాడనే ప్రచారం జరుగుతుంటే, 175 కోట్ల నెంబర్ పెద్దదెలా అవుతుంది. ఇక్కడే ఐకాన్ స్టార్ రేంజ్ ని కావాలని 300 కోట్ల నెంబర్ తో పెంచేస్తున్నారనే కామెంట్స్ పెరిగాయి. అసలు 350 కోట్లు దాటిన హీరో అన్న వార్తలు రెండు నెలలుగా సోసల్ మీడియాని ఊపేశాక, సడన్ గా 175 కోట్ల నెంబర్ పెద్దదెలా అవుతుంది..? అసలు ఈ రెమ్యునరేషన్ వెనకున్న నెంబర్ గేమేంటి? ఆ నెంబర్ తో హీరో రేంజ్ ని బలవంతంగా పెంచుతున్నారనే కామెంట్ కి కారణమేంటి? హావేలుక్

పాన్ ఇండియా హిట్లు అయిపోయాయి.. 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాల ట్రెండ్ అయిపోయింది. బాహుబలి 2, దంగల్ రికార్డులని బ్రేక్ చేయాలన్న కసి మాత్రం మిగిలి ఉంది. పుష్ప2 దాటేసిందన్నారు. కాని తర్వాత వసూళ్ల లెక్కల గోల్ మాల్ అన్న ప్రచారం వల్లే, చాలా మంది ఆ రికార్డుని కాన్ఫిడెంట్ గా నమ్మలేకపోతున్నారు.ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ రెమ్యునరేషన్ లోనెంబర్ వన్ ఎవరని. పాన్ఇండియా లెవల్లో 5 హిట్లతో 5 వేల కోట్లు రాబట్టిన ప్రభాస్, అలానే త్రిబుల్ ఆర్, దేవరతో రెండు హిట్లనే కాదు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆరే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం.

కాని సడన్ గా ఆట్లి మూవీకి 175 కోట్లు తీసుకుంటున్న బన్నీ ఈ విషయంలో నెంబర్ వన్ అనే ప్రచారం మీద ఇప్పుడు నీల్లు చల్లుతోందో కొత్త న్యూస్. అదే వైట్ మనీ, బ్లాక్ మనీ కాన్సెప్ట్… నిజానికి పుష్ప 2 కి బన్నీ తీసుకుంది 150 కోట్లే అయితే, మరో 120 కోట్లు ప్రాఫిట్స్ లో షేర్ ఇచ్చారని ప్రచారం జరిగింది..అంటేప్రాఫిట్ లో షేర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. హిట్టై వసూళ్లు భారీగా వస్తే,దాన్ని బట్టి నెంబర్ మారుతుంది. కాబట్టి దాన్ని రెమ్యునరేషన్ గా కన్సిడర్ చేయలేమనే కామెంట్లు కూడా పెరిగాయి. ఆలెక్కన దేవరకి 200 కోట్లు పారితోషికం తీసుకున్న తారక్, 200 నుంచి 250 కోట్ల వరకు వార్ 2 కి తీసుకుంటున్నాడన్నారు. డ్రాగన్ కి తను ప్రాఫిట్స్ లోషేర్ కాకుండా, 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనంటున్నారు.

ఆ లెక్కన బన్నీకంటే టాప్ లో ఎన్టీఆరే ఉన్నాడు. స్పిరిట్ కి 500 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ కూడా ఒరిజినల్ గా 300 కోట్లే పారితోషికం తీసుకుంటున్నాడట. మిగతా 200 కోట్లు తెలంగాణ, ఆంధ్రా ఏరియా రైట్స్ అని తెలుస్తోంది. అలాచూస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రభాసే 300 కోట్ల తో ఇండియానెంబర్ వన్ హీరోలుగా ఫోకస్ అవ్వాలి. కాని ఆట్లీ మూవీకి 175 కోట్లు తీసుకుంటున్న బన్నీనే నెంబర్ వన్ అన్నట్టు ప్రచారం జరిగింది.ఐతే షేర్లు, బ్లాక్ మనీ లాంటి చిక్కులకు సన్ పిక్చర్స్ ఎప్పుడూ దూరం అనే ప్రచారం ఉంది. ఆ ప్రాసెస్ లో వాల్లు వైట్ మనీ 175 కోట్లిచ్చి, దాంతో సరిపెట్టారనే టాక్ మొదలవ్వగానే, పారితోషికంలో పోటుగాళ్లెవరనే డిస్కర్షన్ మొదలైంది. అలా ఇప్పుడు ఈమూడు కటౌట్ల మీద చర్చ పెరిగింది.