Salaar 2 : సలార్-2 రిలీజ్‌పై నిజమేనా..?
ఇప్పుడు కంట్రీ వైడ్‌గా ఎక్కడ చూసినా పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ పేరే మార్మోగిపోతోంది. సలార్ సీజ్ ఫైర్ సూపర్ హిట్‌తో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడీ రెబల్ స్టార్.. ప్రభాస్ కటౌట్‌కి తగ్గ హిట్టు పడడంతో భారీ వసూళ్ల వర్షం కురుస్తోంది. సలార్ పార్ట్-1 భారీ హిట్‌తో.. సలార్ -2 కోసం అప్పుడే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. సలార్ మూవీ ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పుడు కంట్రీ వైడ్‌గా ఎక్కడ చూసినా పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ పేరే మార్మోగిపోతోంది. సలార్ సీజ్ ఫైర్ సూపర్ హిట్‌తో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడీ రెబల్ స్టార్.. ప్రభాస్ కటౌట్‌కి తగ్గ హిట్టు పడడంతో భారీ వసూళ్ల వర్షం కురుస్తోంది. సలార్ పార్ట్-1 భారీ హిట్‌తో.. సలార్ -2 కోసం అప్పుడే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. సలార్ మూవీ ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా రికార్డులు సృష్టిస్తోంది. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకోవడం వైరల్‌గా మారింది. సలార్ మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని రెబల్ స్టార్ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచి పూనకాలతో ఊగిపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద మరోసారి డైనోసార్ రచ్చ షురూ అంటూ ఇప్పటి నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి.
మొదటి భాగంలోనే స్టోరీ మొత్తం చెప్పేయడంతో పార్ట్ -2 లో ఇక యాక్షన్స్ పీక్స్‌లో ఉంటుందని అర్థమైపోయింది. వరల్డ్ ఆర్మీతో దేవా అనే ఆర్మీ ఎలా పోరాడింది? ఖాన్సార్ సొంతం చేసుకుని వరదరాజ్ మన్నార్ కి అప్పగిస్తాడా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటికే సలార్-2 మేకింగ్ వీడియోను లీక్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ వీడియోని చూస్తుంటే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. పార్ట్-1 లో ప్రభాస్ వార్ జోన్‌లోకి పూర్తిగా దిగలేదు.. పార్ట్ -2లో ప్రభాస్ వార్‌జోన్‌లోకి దిగితే ఎలా ఉంటుందన్నది ఇప్పటికే ఓ అంనా వచ్చేసింది.
‘సలార్ 2’ ని 15 నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రకటించారు. అయితే.. ప్రభాస్‌ను డైనోసార్ రేంజ్‌లో చూపించాలంటే 15 నెలల టైమ్ సరిపోతుందా అన్న డౌట్లు తలెత్తుతున్నాయి. పార్ట్ -2 షూటింగ్ అప్ డేట్ ఎంతవరకూ వచ్చిందన్నదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.. అసలు షూటింగ్ మొదలు పెట్టారా.? ఇప్పటికే కొంత శాతం పూర్తి చేశారా.. ఒకవేళ మొదలు పెడితే 15 నెలల్లో షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం సాధ్యమేనా..? అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. సలార్ మొదటి భాగానికే రిలీజ్ చాలా టైమ్ తీసుకున్న మేకర్స్.. రెండో భాగానికి కనీసం రెండు సంత్సరాలన్నా టైమ్ తీసుకుంటారంటున్నారు విశ్లేషకులు.. మరి దీనిపై నిర్మాత ఎలా స్పందిస్తారో..? సలార్ పార్ట్2 రిలీజ్ ఎప్పటికి రిలీజ్ అవుతుంది అన్నది వేచి చూడాల్సిందే..