మంచు లక్ష్మి విడాకులు తీసుకుందా.. భర్తతో విడిగా ఉండడానికి కారణం ఏంటి..?

మీకు ఈ విషయం తెలుసా..? మంచు లక్ష్మి విడాకులు తీసుకుందట.. కొన్నేళ్ళుగా భర్తకు దూరంగానే ఉంటుందంట.. అసలు ఇద్దరు కలిసి ఉండట్లేదంట..! ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 04:45 PMLast Updated on: Feb 25, 2025 | 4:45 PM

Is Manchu Lakshmi Divorced What Is The Reason For Being Separated From Her Husband

మీకు ఈ విషయం తెలుసా..? మంచు లక్ష్మి విడాకులు తీసుకుందట.. కొన్నేళ్ళుగా భర్తకు దూరంగానే ఉంటుందంట.. అసలు ఇద్దరు కలిసి ఉండట్లేదంట..! ఇలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇవి మంచు లక్ష్మి వరకు కూడా వెళ్లాయి. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. తన లైఫ్ తాను లీడ్ చేస్తూ అలా ముందుకు వెళ్లి పోతుంది. అయితే ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందే కదా.. లేదంటే సోషల్ మీడియా కోడై కూస్తూనే ఉంటుంది.. క్లారిటీ ఇవ్వకపోతే దాన్ని మనం చూస్తూనే ఉండాలి. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత మంచు లక్ష్మి తన వైవాహిక జీవితం గురించి క్లారిటీ ఇచ్చింది.

భర్తతో తనకు ఉన్న దూరం.. ఎందుకు ఇద్దరు విడిగా ఉండాల్సి వస్తుంది.. ఇలాంటి విషయాలపై క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో ప్రస్తుతం లక్ష్మీ చెప్పిన ఆన్సర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల కింద ఐటి ప్రొఫెషనల్ శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంది లక్ష్మి. అప్పట్లో ఈమె ఇండియాలో ఉండేది కాదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. మోహన్ బాబుకు ఒక కూతురు ఉంది అనే విషయం మాత్రమే చాలామందికి తెలుసు కానీ.. ఆమె ఎలా ఉంటుంది అనేది ఎవరికి పెద్దగా ఐడియా కూడా ఉండదు కాదు. కేవలం మంచు విష్ణు, మనోజ్ మాత్రమే మీడియాలో బాగా కనిపించే వాళ్ళు. కానీ అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో నటిగా అడుగు పెట్టింది మంచు లక్ష్మి.

దానికంటే ముందు ఒక టాక్ షో కూడా చేసింది. అలా ప్రేక్షకులకు లక్ష్మీ బాగా చేరువైంది. అప్పటి నుంచి ఆమె భాష, యాసతో తనకంటూ సపరేట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మంచు వారమ్మాయి. అయితే ఈమె మ్యారేజ్ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడింది మంచు లక్ష్మి. భర్త శ్రీనివాస్ కు ఆమె విడాకులు ఇచ్చిందని.. దీని వెనుక మోహన్ బాబు హస్తం ఉందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై మాట్లాడుతూ తన భర్త ఐటీ ప్రొఫెషనల్ అని.. ఆయన విదేశాల్లో పని చేస్తున్నారని.. తన కూతురు కూడా భర్త దగ్గరే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామని.. తమకు నచ్చిన విధంగా బతుకుతున్నామని చెప్పింది. జనాలు తమ గురించి ఏమనుకున్నా కూడా పర్లేదు అని ఎవరో ఏదో అనుకుంటారని మనం జీవించడం మానేయం కదా అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మి. ఈమె చెప్పిన సమాధానంతో తన విడాకులపై వస్తున్న వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్టే.