Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ లో.. రామ్ చరణ్..
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ లో రామ్ చరణ్ నటిస్తే ఎలా ఉంటుంది. బాబాయ్ పాత్రలో అబ్బాయ్ అదిరిపోతుంది. మరి నిజంగా పవన్ బయోపిక్ తీయాల్సిన అవసరం ఉందా? ఎంతైనా చిరు తమ్ముడే కదా, తనకేం కష్టాలుంటాయి.. తనేం కస్టాలు ఫేస్ చేశాడని, తన చరిత్రని మూవీగా మార్చాలి అనుకోవచ్చు.

Ram Charan Key Role in Pawan Kalyan Bio Pic
తవ్వితే పవన్ కష్టాలు ఓ సామాన్యుడికి ఏం తీసిపోవు. మెగాస్టార్ తమ్ముడే అయినా మొదట్నుంచి సింపుల్ గా, ఓ సామాన్యుడిలానే బ్రతికాడు. హీరోగా మారి, స్టారయ్యాక కూడా అలానే బ్రతికాడు.. ఇక పర్సనల్ లైఫ్ లో తను ఫేస్ చేసిన సంఘర్ణనలు తక్కువేం కాదు.. కాబట్టి ఓ బయోపిక్ కి కావాల్సినంత సరకు పవన్ జీవితంలో ఉందనుకోవచ్చు. ఐతే ఇప్పుడు నిజంగా పవన్ బయోపిక్ చరణ్ చేస్తున్నాడా అంటే, ఇంచుమించు అలాంటి ప్రయత్నమే జరుగుతోందట.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ మూవీలో హీరో పాత్ర అచ్చుగుద్దినట్టు పవన్ రియల్ లైఫ్ నే పోలి ఉంటుందట. జనసేనా పార్టి, పవన్ పొలిటికల్ జర్నీ ని రిఫ్లెక్ట్ చేసేలా పవన్ వ్యక్తిత్వం పోలేలా చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. నిజానికి పవన్ కోసమే రాసిన కథ అవటం వల్లే అలా శంకర్ రెడీ చేసుండొచ్చు. మొత్తానికి గేమ్ ఛేంజర్ మూవీతో ఒకేసారి చరణ్ పెర్ఫామెన్స, పవన్ పాత్ర రెండూ ఎక్స్ పీరియన్స్ అవ్వొచ్చు. ఓరకంగా పవన్ ఆత్మని, చరణ్ నటనని ఒకే టిక్కెట్ తో చూడబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.