పుష్ప... ఇండియన్ సినిమాను బాహుబలి సిరీస్ షేక్ చేస్తే.. ఈ సీరీస్ మాత్రం ఇండియన్ సినిమాకు కొత్త పాఠాలు నేర్పింది. ఇప్పటివరకు తెలుగు సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లకు అల్లు అర్జున్ తన దమ్ము ఏంటీ అనేది పక్కా లెక్కల తో క్లారిటీగా చూపించేశాడు. ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని ఎవరు అంచనా వేసుకోలేదు. పుష్ప సీరిస్ మొదలైన తర్వాత ఏమాత్రం హోప్స్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పార్ట్ 1 ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ సినిమాపై సీరియస్ గా ఫోకస్ చేయలేదు. కానీ తర్వాత ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ పెరగడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇక పుష్ప పార్ట్ 2 విషయంలో అల్లు అర్జున్ అలాగే సుకుమార్ సీరియస్ గా ఫోకస్ చేయడం... మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా పెడుతున్న ఖర్చులు చూసిన సినిమా వాళ్లకు స్లోగా సినిమా అర్థమవుతూ వచ్చింది. అసలు అల్లు అర్జున్ ప్లాన్ పాన్ ఇండియా లెవెల్ కాదు పాన్ వరల్డ్ అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. మెగా అభిమానులు అయితే అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ట్రోల్ చేసినా సరే సినిమా మాత్రం దుమ్ము రేపటం కామన్ అయిపోయింది. ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇక ఈ సినిమా రన్ టైం ఎక్కువగా ఉన్నా సరే అభిమానులు మాత్రం ఎక్కడా బోర్ ఫీల్ అవ్వలేదు. నార్మల్ ఆడియన్స్ కొన్ని కామెంట్స్ చేసినా సరే సినిమా మాత్రం ఎంటర్టైనింగ్ ఉండటంతో ఎంజాయ్ చేశారు. పుష్ప రన్ టైం మూడు గంటల 17 నిమిషాలు కాగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో 20 నిమిషాలు యాడ్ చేస్తూ సినిమా మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మరో 20 నిమిషాలు సినిమాకు యాడ్ కావడంతో మూడు గంటల 40 నిమిషాలు ఈ సినిమా ప్లే కానుంది. ఇక ఈ వెర్షన్ కు టికెట్ల ధరలను భారీగా తగ్గించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్లాన్ తో మరోసారి ప్రేక్షకులను థియేటర్ వైపు నడిపించేందుకు పుష్ప మేకర్స్ రెడీ అవుతున్నారు. సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ ఈ వెర్షన్ కి డబ్బింగ్ కూడా చెప్పారు. సుకుమార్.. రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారట. ఈసారి ప్రత్యేకంగా ఉత్తరాది ఆడియన్స్ ను సినిమా ధియేటర్ వైపు నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 1850 కోట్ల మార్కు దాటిన ఈ సినిమా బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఈసారి 2000 కోట్లను కొల్లగొట్టి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ దంగల్ సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది.[embed]https://www.youtube.com/watch?v=DSQzvbqBDwI[/embed]