Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ వల్ల కెరీర్ కోల్పోయిన హీరోయిన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరికీ హాని చేయడు. ఎవరినీ మోసం చేయడు. చేయలేడు. కుదిరితే తను నష్టపోయినా పర్లేదనుకునే వ్యక్తిత్వం పవన్ ది.. కాని ఇప్పుడు ఆ హీరో తనకు తెలియకుండా చేసిన మిస్టేక్ వల్ల ఓ హీరోయిన్ కెరీరే స్మాష్ అవుతోంది. ఆ లేడీనే నిధీ అగర్వాల్.

Nidhi Agarwal Lost Film Chance with pawan kalyan
హరి హర వీరమల్లు లాంటి ఆఫర్ వచ్చింది కదాని, పవన్ సరసన మెరిసి స్టార్ హీరోయిన్ అయిపోతానని కలలు కంది. కాని హరి హర వీరమల్లు సెట్లు పాడవుతున్నాయి. రోజులు నెలలు గడుస్తున్నాయి. అదో సినిమా ఉందనే ఆలోచనలు జనాల మైండ్ నుంచి ఆవిరౌతున్నాయి. కాని హరి హర వీరమల్లు బండి ముందుకు కదలట్లేదు.
కారణం పవన్ పొలిటికల్ గా బిజీ అవటం, త్రివిక్రమ్ తన టీం తాలూకు సినిమాలను స్పీడప్ చేయటం.. వీటితో హరి హరవీరమల్లు షూటింగ్ లో ఎలాంటి కదలికలేదు. దీంతో ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఏకంగా పవన్ సరసన మెరిసి ఏదో అయిపోదామనుకునర్న నిధి ఆశలు ఆవిరయ్యాయి. హరి హర వీరమల్లు కి సైన్ చేసేముందు చిన్నా చితకా ఆఫర్లన్నా వచ్చేవి. ఇప్పుడు హరి హర వీరమల్లు డేట్లన్ని ఇచ్చి, పూర్తిగా ఆ మూవీకే అంకితమైంది నిధి.
వద్దని వదిలేద్దామ అంటే, పవన్ ప్రాజక్ట్ నుంచి పక్కకు తప్పుకునే సాహసం చేయలేదు. చేద్దామా అంటే షూటింగ్ జరగదు.. దీంతో ఇప్పుడు వరుడు మూవీ హీరోయిన్ తో నిధిని పోలుస్తున్నారు. ఆ టైంలో హీరోయిన్ ని చూపించకుండా ఏడాది పైనే దాచిపెట్టి, తర్వాత వరుడు రిలీజ్ అయ్యాకే హీరోయిన్ ని రివీల్ చేశారు. కాని ఏమైంది వరుడు డిజాస్టర్ అవటం, ఆ హీరోయిన్ అడ్రస్సే గల్లంతవ్వటం జరిగింది. నిధి పరిస్థితి కూడా అలానే ఉందనే మాటే వినిపిస్తోంది.