పుష్పపై దేవర సైన్యం కోపం, సపోర్ట్ కష్టమేనా…?
దేవర సినిమా ఏ ముహూర్తంలో ఖరారు అయిందో గాని సినిమా ట్రోల్ చేసిన రేంజ్ వేరే లెవెల్. మెగా ఫ్యాన్స్ అయితే దేవరపై పగబట్టి ట్రోల్ చేసారు. కొరటాల శివ మీదున్న కోపమో లేక ఎన్టీఆర్ మీదున్న కోపమో తెలియదు గాని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం చూసాం.
దేవర సినిమా ఏ ముహూర్తంలో ఖరారు అయిందో గాని సినిమా ట్రోల్ చేసిన రేంజ్ వేరే లెవెల్. మెగా ఫ్యాన్స్ అయితే దేవరపై పగబట్టి ట్రోల్ చేసారు. కొరటాల శివ మీదున్న కోపమో లేక ఎన్టీఆర్ మీదున్న కోపమో తెలియదు గాని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం చూసాం. మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తోడై ఓ రేంజ్ లో టార్గెట్ చేసారు. కాని వాటిని తట్టుకుని దేవర నిలబడింది. వందల కోట్ల వసూళ్ళతో ఇప్పుడు దేవర సినిమా బాలీవుడ్ కు కూడా చాలెంజ్ చేసింది. వెయ్యి కోట్లు అవుతుందని ఆశగా చూసారు ఫ్యాన్స్.
అయితే ఈ విషయంలో దేవర ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు. మెగా ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అయిన దగ్గరి నుంచి కూడా సినిమాను పదే పదే టార్గెట్ చేస్తూ డిజాస్టర్ అంటూ నెగటివ్ స్ప్రెడ్ చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టైం వచ్చింది. మెగా హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. పుష్ప 2 నుంచి ఇది మొదలవుతుంది. పుష్ప 2కి దేవర సైన్యం సపోర్ట్ చేస్తుందని అందరూ ఎదురు చూసినా… కష్టం అనే టాక్ వస్తోంది. పుష్ప 2 ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే… దేవర ఆర్మీ అండగా ఉంటుందని భావించారు.
కాని సినిమా అంత ఈజీగా ఉండే ఛాన్స్ లేదని అర్ధమవుతోంది. దేవరను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్న విషయం తెలిసినా… సినిమా డిజాస్టర్ అనే టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారని తన దృష్టికి వచ్చినా అల్లు అర్జున్… దేవరకు సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయలేదు. దేవర విషయంలో ఎన్టీఆర్ ఇవన్నీ గమనించి ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. చిన్న హీరోలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. చిన్న హీరోలే దేవరకు హెల్ప్ చేసారు. ఫ్యాన్స్ ఇవన్నీ గమనించారు కూడా.
ఎన్టీఆర్… పుష్ప 2 కు సపోర్ట్ చేసినా ఫ్యాన్స్ ఊరుకునే ఛాన్స్ లేదు. ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ కు మధ్య మంచి స్నేహమే ఉంది. కాని బన్నీ మాత్రం దేవరను ట్రోల్ చేసినా సైలెంట్ గా ఉండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అసలు నచ్చలేదు. ఇతర హీరోలు కూడా ఎన్టీఆర్ కు అండగా నిలబడలేదు. కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో అందరిపై సీరియస్ గా ఉన్నారు. మహేష్ బాబు… జిగ్రాకు సపోర్ట్ చేసాడు గాని దేవరకు సపోర్ట్ చేయలేదు అనే మంట కూడా ఫ్యాన్స్ లో ఉంది.