Pawan Kalyan: తప్పు చేసింది హారీష్ శంకర్.. బ్లేమ్ అవుతోంది పవర్ స్టార్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య వరుసగా కామెంట్లు, తనే తప్పు చేస్తున్నట్టు బ్లేమ్ గేమ్ షురూ అయ్యింది. మొన్నటికి మొన్న హరీష్ శంకర్ తీసే ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత పవన్ కాళ్ల మీద పడితే, కారణం షూటింగ్ కి పవన్ కరునించాలని వేడుకోవటం అన్నారు.

Pawan Kalyan and Harish Shankar Film
ఏజ్ గ్యాప్ లేకున్నా అలా కాళ్ల మీదపడటం కరెక్ట్ కాదనే కామెంట్లు వచ్చాయి. అంతేకాని అతనలా చేయటానికి కారణం ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ డేట్లు ఇవ్వకపోవటమనే కామెంటే అర్ధరహితమంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మొదట్నుంచి హరీష్ శంకరే తప్పు చేస్తూ వస్తున్నాడట.
పవన్ పొలిటికల్ గా ఎప్పుడు బిజీ అవుతాడో, ఎప్పుడు గ్యాప్ ఇస్తాడో తేలకపోయేసరికి హరీష్ శంకర్ షూటింగ్ షెడ్యూల్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాడట. మరి సుజీత్ ఓజీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్కడే హరీష్ శంకర్ తప్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పవన్ నటించే సీన్లు లేటైతే, ఈలోపు తను లేకుండా ఉండే సీన్లు తీయొచ్చు కదా అంటే, హరీష్ దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేకపోతున్నాడట. సుజిత్ మాత్రం పవన్ వస్తే తనతో సెట్లో షూటింగ్, మిగతా టైంలో హీరో లేని సీన్ల షూటింగ్ తో దూసుకెళుతున్నాడట. ఇలా చూస్తే దర్శకుల ప్లానింగ్ లోపంతో పవన్ బ్లేమ్ అవుతున్నాడనే అభిప్రాయం పెరుగుతోంది.