Prabhas : న్యూ లుక్‌తో ప్రభాస్.. హార్ట్స్ బ్రేక్ చేయనున్నాడా..?
బహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇక.. సలార్ హిట్‌తో మరోసారి ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇక.. డార్లింగ్ చేయబోయే నెక్ట్స్ మూవీస్ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు. వాటిలో డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం వస్తన్న అప్డేట్స్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తున్నాయి.
బహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇక.. సలార్ హిట్‌తో మరోసారి ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఇక.. డార్లింగ్ చేయబోయే నెక్ట్స్ మూవీస్ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు. వాటిలో డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం వస్తన్న అప్డేట్స్ ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇస్తున్నాయి. ఈ మూవీలో డార్లింగ్ లుక్ అదిరిపోతుందంటూ వచ్చిన ఓ గాసిప్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
డైరెక్టర్ మారుతి ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇది ఇలా ఉంటే.. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపిస్తాడట.. డార్లింగ్ స్టైలిష్ లుక్‌లో ఏ రేంజ్లో హార్ట్స్ బ్రేక్ చేస్తాడో అన్న విషయం మిస్టర్ ఫెర్ఫెక్ట్ చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో మరోసారి అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ప్రభాస్ అదరగొడతాడని తెలుస్తోంది. ఈ మూవీలోప్రభాస్ హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓన్లీ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్టు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ మధ్య కాలంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు పవర్ ఫుల్ యాక్షన్ సినిమాలే.. అయితే. మారుతీ డైరక్షన్లో వస్తున్న ఈ మూవీలో మాత్రం ప్రభాస్ ఇందుకు భిన్నంగా కనిపించబోతున్నారట. ఇందులో ప్రభాస్ పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుందంటున్నారు. ఈ సినిమాలోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని, ముఖ్యంగా ఈ సినిమా లో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని టాక్. ఈ మూవీని మాస్ మసాలా ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారట మారుతి.. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ హిట్ అయితే.. డైరెక్టర్‌గా మారుతీ రేంజ్ మారిపోయినట్లే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.