Prashanth Neel : ప్రశాంత్‌ నీల్‌ జూనియర్ ఎన్టీఆర్ ని ముంచేయబోతున్నాడా..?

ప్రశాంత్‌ నీల్‌ మాటలు నమ్మవచ్చా? లేదా? ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెబుతున్న వాటిల్లో నిజమెంత? అబద్దమెంత? డైరెక్టర్‌ను ఎందుకిలా అనుమానించాల్సి వస్తోంది? ఫ్యాన్ లో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. కెజిఎఫ్‌.. కెజిఎఫ్‌2 వంటి పాన్‌ ఇండియా హిట్స్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సలార్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. సలార్‌ ట్రైలర్‌ కూడా కెజిఎఫ్‌లా బ్లాక్‌ షేడ్‌లోనే సాగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 02:33 PMLast Updated on: Dec 11, 2023 | 2:33 PM

Is Prashanth Neel Jr Going To Drown Ntr

ప్రశాంత్‌ నీల్‌ మాటలు నమ్మవచ్చా? లేదా? ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెబుతున్న వాటిల్లో నిజమెంత? అబద్దమెంత? డైరెక్టర్‌ను ఎందుకిలా అనుమానించాల్సి వస్తోంది? ఫ్యాన్ లో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. కెజిఎఫ్‌.. కెజిఎఫ్‌2 వంటి పాన్‌ ఇండియా హిట్స్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సలార్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. సలార్‌ ట్రైలర్‌ కూడా కెజిఎఫ్‌లా బ్లాక్‌ షేడ్‌లోనే సాగింది. 22న వస్తున్న సలార్‌ ప్రమోషన్లో ఎన్టీఆర్‌ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్‌ నీల్. అందరూ అనుకున్నట్టే.. తన గత సినిమాల్లాగా యాక్షన్‌ జోనర్‌లో ఎన్టీఆర్‌ మూవీ చేయలనుకోవడం లేదన్నాడు. కచ్చితంగా డిఫరెంట్‌ ఎమోషన్స్‌తో.. ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా వుంటుందని హింట్‌ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌ మూవీ ఇప్పటివరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా వుంటుందని ప్రశాంత్‌ నీల్‌ నమ్మకంగా చెప్పాడు. సలార్‌ విడుదల తర్వాత ఎన్టీఆర్‌ మూవీ వర్క్‌ మొదలుపెట్టి.. 2024 సెకండాఫ్‌లో సెట్స్‌పైకి తీసుకొస్తానన్నాడు. గత సినిమాలకు భిన్నంగా వుంటుందని డైరెక్టర్‌ చెబుతున్నా తారక్‌ అభిమానులు నమ్మలేకపోతున్నారు. ఈఇద్దరి కాంబో సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తే.. కెజిఎఫ్‌. సలార్‌ మాదిరి హీరో బ్లాక్‌డేడ్‌లోనే వున్నాడు. షేడ్‌ కూడా మార్చలేదు.. జానర్‌ మారుస్తాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.