Pushpa3 : పుష్ఫ-3 ప్రారంభం అక్కడేనా..?

పుష్ఫ-1 (Pushpa1) తో స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) కొట్టిన భారీ హిట్‌తో.. ‘పుష్ప 2’ (Pushpa2) పై కూడా అలాంటి హై ఎక్స్‌‌పెక్టేషన్సే ఉన్నాయి. ‘పుష్ప’ సౌత్‌‌తో పాటు నార్త్‌‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇందులో పాటలతో పాటు.. బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్‌‌ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ‘సెకెండ్‌‌ పార్ట్‌‌ ఎప్పుడు పుష్పా’ అంటూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 10:50 AMLast Updated on: Feb 07, 2024 | 10:50 AM

Is Pushpa 3 Starting There

 

పుష్ఫ-1 (Pushpa1) తో స్టైలిష్ స్టార్ (Stylish Star) అల్లు అర్జున్ (Allu Arjun) కొట్టిన భారీ హిట్‌తో.. ‘పుష్ప 2’ (Pushpa2) పై కూడా అలాంటి హై ఎక్స్‌‌పెక్టేషన్సే ఉన్నాయి. ‘పుష్ప’ సౌత్‌‌తో పాటు నార్త్‌‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇందులో పాటలతో పాటు.. బన్నీ డైలాగ్స్, మేనరిజమ్స్‌‌ బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ‘సెకెండ్‌‌ పార్ట్‌‌ ఎప్పుడు పుష్పా’ అంటూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే అంచనాలను మించి సీక్వెల్ ఉండాలని స్క్రిప్ట్ వర్క్‌‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు సుకుమార్. అల్లు అర్జున్ కూడా వేరే సినిమా ఏదీ స్టార్ట్‌‌ చేయకుండా ఈ మూవీ షూట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతూ ఉండగా ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి రీసెంట్ గానే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. పుష్ప-3 (Pushpa3) అంటూ వచ్చిన ఈ లేటెస్ట్ అప్‌డేట్ బన్నీ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచేస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో షూట్ జరుపుకుంటున్న పుష్ప-2 టీమ్.. అనంతరం జపాన్ కి వెళ్తున్నారని అక్కడ కీలక సన్నివేశాలు చేస్తున్నారని వచ్చింది. అయితే ఇప్పుడు అసలు జపాన్ షూట్ లోనే క్లైమాక్స్ సీన్స్ అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. అక్కడే పుష్ప 2 కి ఎండింగ్ షూట్‌తో పాటు.. “పుష్ప 3” కి స్టార్ట్ కూడా ఉండబోతోందన్న రూమార్స్ వినిపిస్తున్నాయి. దీంతో.. పుష్ప మూవీ వీరాభిమానులు సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil) చేసిన కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలాన్నిస్తున్నాయి. సుకుమార్‌‌‌‌తో తనతో మాట్లాడిన మాటల్లో ‘పుష్ప 3’కి కూడా ఉండే అవకాశం ఉందని అర్థమైందని ఫాజిల్ తెలిపారు. దీనిని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో.. పుష్ప-2 ఇంకా రిలీజ్ కాకముందే పుష్ప-3 గురించిన వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి పార్ట్‌‌ 3 అనేది ఆలోచనకు మాత్రమే పరిమితమవుతుందా లేక త్వరలోనే దానిపై కూడా అనౌన్స్‌‌మెంట్‌‌ ఉంటుందా