ఉమైర్ సందు ట్వీట్ వెనుక పుష్ప..? గేమ్ చేంజర్ పై కుట్ర జరుగుతోందా…?
తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ కు పట్టబగలే చుక్కలు చూపించడంతో బాలీవుడ్ స్టార్లు తెలుగు సినిమాలపై కుట్రలు చేయడం మొదలుపెట్టారు.
తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ కు పట్టబగలే చుక్కలు చూపించడంతో బాలీవుడ్ స్టార్లు తెలుగు సినిమాలపై కుట్రలు చేయడం మొదలుపెట్టారు. లేనిపోని హడావుడి చేస్తూ సినిమాలు గురించి తమ ఒపీనియన్స్ బయట పెడుతూ నాన్సెన్స్ క్రియేట్ చేస్తూ అభిమానుల్లో ఒక రకమైన భయాన్ని పెంచుతున్నారు. తెలుగు సినిమాల గురించి నెగిటివ్ పబ్లిసిటీని స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి బాలీవుడ్ ఒక రకంగా కుట్ర చేయడం మొదలుపెట్టింది అనే ఒపీనియన్ బలంగా వినపడుతోంది.
లేటెస్ట్ గా సెన్సార్ బోర్డు రివ్యూ అంటూ ఉమైర్ సందు అనే క్రిటిక్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా సెన్సార్ బోర్డ్ ఓవర్సీస్ మెంబర్ గా ఉన్న ఉమైర్ సందు… ఈ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు సినిమా బాగాలేదని.. 80 ల 90ల నాటి సినిమా అంటూ రామ్ చరణ్ కెరీర్ శంకర్ నాశనం చేశాడని… శంకర్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి విశ్రాంతి తీసుకోవాలి అంటూ పోస్ట్ చేశాడు. 90 ల కాలం నాటి పాత కథ అని సినిమాలో స్టార్ యాక్టర్ లందరూ నిరాశపరిచారు అంటూ తన ఒపినియన్ షేర్ చేసాడు.
ఒక క్రింజ్ సినిమా తీశారని సెటైర్లు వేశాడు. రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా ఖచ్చితంగా కన్నీళ్లు మిగులుస్తుంది అంటూ కామెంట్ చేయడం గమనారం. ఇండియన్ 2 సినిమాతో కమల్ హాసన్ కెరీర్ నాశనం చేశాడని ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ ని కూడా నాశనం చేస్తున్నాడని… అన్ని సినిమాలను కలిపి ఈ సినిమా తీసాడు అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. బాలీవుడ్ సినిమాలకు ఎప్పుడూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చే సందు.. ఇప్పుడు ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నెంబర్ అని చెప్పుకుంటూ హడావుడి చేయడం చూసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
కావాలనే గేమ్ చేంజర్ సినిమాపై కుట్ర జరుగుతోందని… పుష్ప సినిమా గురించి మాట్లాడని ఉమెర్ సందు.. గేమ్ సినిమా గురించి ఎందుకు హడావుడి చేస్తున్నాడని, ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో అసలు టికెట్లు బుక్ కావడం లేదంటూ కూడా మాట్లాడాడు. ఓవర్సీస్ మార్కెట్ లో మేజర్ రోల్ ప్లే చేసే యూఎస్ మార్కెట్లో ప్రీ బుకింగ్ అసలు జరగటం లేదంటూ సోకాల్డ్ గ్లోబల్ స్టార్ అంటూ రాంచరణ్ వాల్యూ తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే టాలీవుడ్ డామినేషన్ బాలీవుడ్ పై నచ్చక ఈ విధంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడని అంటున్నారు. అయితే దీని వెనక వేరే శక్తులు కూడా ఉండవచ్చు అని నార్త్ ఇండియాలో గేమ్ చేంజర్ సినిమా ఆడకుండా చూసే కుట్ర జరుగుతోంది అంటూ టాలీవుడ్ లో కూడా ఒపీనియన్స్ వినపడుతున్నాయి.