నాన్ బాహుబలి రికార్డులు బద్దలుకొడతాడా..? వారంలో అంటే నమ్మేస్తారా..?

నాన్ బాహుబలి రికార్డ్స్ అన్న మాటకు అర్ధం... బాహుబలి 2 కి వచ్చిన 1850 కోట్ల వసూళ్లని మరే మూవీ టచ్ చేయలేదు.. కాబట్టి, ఆ రికార్డు కాకుండా ఏసినిమా కొత్తగా మరే రికార్డు క్రియేట్ చేసిందని...దీని డిస్కర్షన్ ఇప్పుడు రావటానికి రీజాన్, లైఫ్ టైంలో బాహుబలి 2 యూఎస్ లో రాబట్టిన 25 మిలియన్ డాలర్ల వసూళ్లు పుష్పరాజ్ రెండు వారాల్లోనే రాబట్టేస్తాడట..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2024 | 07:14 PMLast Updated on: Dec 11, 2024 | 7:14 PM

Is Pushpa Collections Are Fake

నాన్ బాహుబలి రికార్డ్స్ అన్న మాటకు అర్ధం… బాహుబలి 2 కి వచ్చిన 1850 కోట్ల వసూళ్లని మరే మూవీ టచ్ చేయలేదు.. కాబట్టి, ఆ రికార్డు కాకుండా ఏసినిమా కొత్తగా మరే రికార్డు క్రియేట్ చేసిందని…దీని డిస్కర్షన్ ఇప్పుడు రావటానికి రీజన్, లైఫ్ టైంలో బాహుబలి 2 యూఎస్ లో రాబట్టిన 25 మిలియన్ డాలర్ల వసూళ్లు పుష్పరాజ్ రెండు వారాల్లోనే రాబట్టేస్తాడట… ఆల్రెడీ మొదటి సగం వారంలోనే బాహుబలి 2 తాలూకు సగం రికార్డుని ఆల్రెడీ పుష్ప2 బ్రేక్ చేశాడంటున్నారు. ఒకవైపు పుష్ప 2 లో కథ లేదని, సెకండ్ హాఫ్ లో బోరింగ్ స్క్రీన్ ప్లే అని టాక్స్ పెరిగాయి. విచిత్రంగా నార్త్ ఇండియాలో మాత్రం వసూల్ల వరదలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో యూఎస్ వసూల్ల లెక్కల్లో లోపాలే ఎక్కువున్నాయా? ప్రమోషన్ స్ట్రాటజీనేనా అన్న డౌట్లు పెరిగాయి… ఇన్నింట్లో పుష్ప2 యూఎస్ వసూళ్ల లెక్కలు, 2 డేస్ లోదేవరని దాటేసి, 1 వీక్ లో త్రిబుల్ ఆర్ ని దాటాయంటున్నారు. బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడానికి 2 వారాలు చాలంటున్నారు. ఇదే ఇంకాస్త అతి అనేస్తున్నారు. నిన్నేమో థియేట్రికల్ బిజినెస్, ఇప్పుడు యూఎస్ వసూల్లతో అవసరానికి మించి ప్రచారం చేస్తున్నారా? లేదంటే వసూళ్ల లెక్కలు నిజమేనా?

పుష్ప రాజ్ ఫస్ట్ డే 294 కోట్లు రాబట్టాడన్నారు.. తర్వాత రోజు 400 కోట్లు, మూడో రోజు 621 కోట్లు, నాలుగో రోజు 829 కోట్లు… ఇలా ప్రచారం పెంచారో లేదో, ఇంతలో ఓవర్ సీస్ వసూల్లొచ్చాయి.. ఆలెక్కలు ఇంతకంటే వెరైటీ గా ఉన్నాయి… బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కీ లాంటి సినిమాలు లైఫ్ టైంలో రాబట్టిన వసూళ్లని పుష్ప2 కేవలం మూడు రోజులు, లేదంటే 5 రోజుల్లోనే బ్రేక్ చేశాడంటున్నారు.

మరో వారం గడిస్తే బాహుబలి 2 తాలూకు యూఎస్ వసూళ్ల రికార్డుని పుష్ప 2 మింగేయబోతోందని ప్రచారం చేస్తున్నారు. అదే కాస్త లాజిక్ కి దూరంగా ఉంది… ఎందుకంటే పుష్ప2 యూఎస్ కలెక్సన్స్ చూస్తే, కేవలం 4 రోజుల్లో 10 మిలియన్లు రాబట్టిందట పుష్ప2 మూవీ.

అంటే దేవర లైఫ్ టైంలో రాబట్టి 5.5 మిలియన్లను పుష్ప రాజ్ కేవలం రెండురోజుల్లోనే రాబట్టినట్టు…ఇక యూఎస్ లో ఇప్పటి వరకు 25 మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి 2నే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నెంబర్ వన్ మూవీ గా కొనసాగుతోంది…

ఆరికార్డుని ఈ వీకెండ్ కల్లా పుష్ప2 బ్రేక్ చేస్తుందంటున్నారు. బాహుబలి 2 వచ్చినప్పుడు ఎలాంటి నెగెటీవ్ టాక్ లేదు. అప్పుడు కూడా టిక్కెట్ రేటు ఏమంత తక్కువ కాదు.. అయినా యూఎస్ లో 7 ఏళ్ల క్రితం రేట్లు ఇప్పటితో పోలిస్తే పెద్దగా తేడా ఏంలేదు.. కాబట్టి ఎలా చూసినా యూఎస్ లో పుష్ప2 కేవలంగ నాలుగైదు రోజుల్లో 10 మిలియన్ డాలర్లను రాబడితే, మరో 7 రోజుల్లో 25 మిలయన్లను రాబట్టేస్తే అదో అద్బుతం..

కాని యూఎస్ లో చాలా థియేటర్స్ ఎంతో కొంత కాలీగా కనిపిస్తున్నాయి. ఇండియాలో మరీ ముఖ్యంగా సౌత్ లోఅన్నీ హౌజ్ ఫుల్ అయితే ఉండట్లేదు.. ఇలాంటప్పుడు ఇక్కడ 1850 కోట్ల ఓవరాల్ రికార్డులు, యూఎస్ లో 25 మిలయన్ల వసూళ్ల రికార్డుని పుష్పరాజ్ ఎలా బ్రేక్ చేస్తాడు… ఇదే లాజిక్ కి అందని ప్రశ్న.

ఏదో ఉప్పెనొచ్చినట్టు బాహుబలి 2 కి జనం వస్తేనే 1850 కోట్ల వసూళ్లు 50 రోజుల్లో వచ్చాయి. అలాంటి వసూళ్లని కేవలం రెండు మూడు వారాల వసూల్లతోనే పుష్ప2 బ్రేక్ చేస్తుందనే నమ్మశక్యంగా లేదు. మరి ఇవన్నీ ఫేకా అంటే అలా అని కూడా అనలేం… అలాని ఆ నెంబర్స్ ని నమ్మలేం.. కాకపోతే వచ్చిన వసూళ్లనే కాస్త ఎక్కుువ చేసి చూపిస్తున్నారేమో అన్న డౌట్లు మాత్రం పెరిగాయి.