Ram Charan: ఆస్కార్‌ వేదికపై రామ్‌చరణ్‌కు అవమానం!?

ఆస్కార్ వేదిక మీద చెర్రీ ఫొటో లేకపోవడానికి టెక్నికల్ కారణం అయి ఉండొచ్చు.. లేదంటే ఆస్కార్‌ కమిటీలో పనిచేసే వాళ్ల పొరపాటు కావొచ్చు. ఐతే ఇదే ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు కారణం అవుతున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2023 | 02:10 PMLast Updated on: Mar 13, 2023 | 2:10 PM

Is Ram Charan Insulted On Oscars Stage

ప్రపంచానికి నాటు సౌండ్ పరిచయం చేసింది జక్కన్న అండ్ టీమ్ ! తెలుగు పదం విలువెంతో.. పాటకున్న పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. కీరవాణి, చంద్రబోస్ అవార్డు అందుకున్న క్షణం.. అఖండ భారతావని ఉప్పొంగింది. ఆస్కార్ అవార్డు మీద ఆ నాలుగు చేతులే కనిపించినా.. మనసు మాత్రం 150 కోట్ల మందిది అనిపించింది. ట్రిపుల్ ఆర్ టీమ్ చేసిన సందడికి అయితే హద్దే లేదు. ఐతే అదే సమయంలో ఏ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు కారణం అవుతోంది.

నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించినప్పుడు.. ఆ ట్రోఫీ అందుకున్నప్పుడు.. చంద్రబోస్, కీరవాణి వెనక ఆర్ఆర్ఆర్ టైటిల్, ఎన్టీఆర్ ఫొటో మాత్రమే కనిపించాయ్. దీంతో చెర్రీ ఫొటో ఎక్కడ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. చెర్రీ లేనిది ఆర్ఆర్ఆర్‌ లేదు.. రామరాజు పాత్రకు ఆ స్థాయిలో ప్రాణం పోశాడు మరి ! పైగా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్‌ చేసుకొని మరీ.. అమెరికాలో ప్రమోషన్స్‌ కోసం చెర్రీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటిది రాంచరణ్‌ ఫొటో పెట్టకపోవడం అంటే.. అవమానించినట్లే అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతుంది.

రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు ఇప్పుడు మొదలైన వివాదం ఆస్కార్‌ క్రెడిట్‌ను ఇప్పుడు ఇద్దరు హీరోలకు సమానంగా పంచడంలో సరికొత్త సవాళ్లు ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్కార్ వేదిక మీద చెర్రీ ఫొటో లేకపోవడానికి టెక్నికల్ కారణం అయి ఉండొచ్చు.. లేదంటే ఆస్కార్‌ కమిటీలో పనిచేసే వాళ్ల పొరపాటు కావొచ్చు. ఐతే ఇదే ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు కారణం అవుతున్నాయ్. చెర్రీ, ఎన్టీఆర్‌ హీరోలు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషనల్ బాండింగ్‌. వాళ్ల గురించి కాస్త తక్కువ అయినా.. తట్టుకోలేరు ఫ్యాన్స్. ఇప్పుడు ఆస్కార్ వేదిక మీద చెర్రీ ఫొటో లేకపోవడంపై ఇంతలా హర్ట్ అవుతోంది కూడా అందుకే ! ఆస్కార్‌ ఇండియాకు తీసుకొచ్చి.. ఇప్పుడు ఇద్దరు హీరోలకు రాజమౌళి ఎలాంటి క్రెడిట్ ఇస్తారు.. ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది హాట్‌టాపిక్ అవుతోంది.