దేవరకొండ కోసం రష్మిక పెద్ద రిస్కే చేస్తోందా…?

గత కొన్నాళ్ళ నుంచి విజయ్ దేవరకొండకు సరైన హిట్ రావడం లేదు. లైగర్ సినిమా భారీ హిట్ అవుతుందని అందరూ భావించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 10:26 AMLast Updated on: Aug 20, 2024 | 10:26 AM

Is Rashmika Taking A Big Risk For Devarakonda

గత కొన్నాళ్ళ నుంచి విజయ్ దేవరకొండకు సరైన హిట్ రావడం లేదు. లైగర్ సినిమా భారీ హిట్ అవుతుందని అందరూ భావించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. కాని మనోడికి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యలో వచ్చిన కల్కీ సినిమా హిట్ అయినా అది విజయ్ ఖాతాలో పడే ఛాన్స్ లేదు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు ఒకరు విజయ్ కోసం ఒక లైన్ రెడీ చేసారని, ఆ కథ కూడా విజయ్ దేవరకొండకు చెప్పారని టాక్ వస్తోంది.

ఇదిలా ఉంచితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం రష్మిక మందన ఒక రిస్క్ చేస్తోందని గుసగుసలు వినపడుతున్నాయి. తనతో బాగా క్లోజ్ గా ఉండే ఒక కన్నడ దర్శకుడితో ఇటీవల రష్మిక చర్చలు జరిపిందని శాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ కోసం ఒక క్లాస్ కథ రెడీ చేయాలని, సినిమా క్లైమాక్స్ లో యాక్షన్ పార్ట్ ఉండే విధంగా ప్లాన్ చేయాలని, సినిమాలో కామెడి పార్ట్ వద్దని, తానే హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తా అని చెప్పిందట. అలాగే ఈ సినిమాకు తానే నిర్మాతగా కూడా వ్యవహరిస్తా అని చెప్పడం ఆ దర్శకుడ్ని షాక్ గురి చేసింది.

మరో టాలీవుడ్ నిర్మాతతో కలిసి ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నా అని తన వద్ద ఒక కథ కూడా రెడీగా ఉందని, దాన్ని మార్పులు చేర్పులు చేసి సిద్దం చేయాలని అడిగిందట. స్వయంగా రష్మిక అడగడంతో వచ్చే ఏడాది నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం అని చెప్పాడట ఆ డైరెక్టర్. ఎప్పటి నుంచో రష్మిక… మంచి కథ ఉంటే తాను సినిమా నిర్మిస్తా అని సోషల్ మీడియాలో చెప్తూ వస్తుంది. అలా వచ్చిన ఒక కథ విజయ్ కు బాగా సూట్ అవుతుందని ఆమె ఫిక్స్ అయినట్టు టాక్. ఆ సినిమా మరి ఏ రేంజ్ లో ఉంటుందో, సినిమా బడ్జెట్ ఎంతో చూడాలి. ప్రస్తుతం విజయ్… రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.