సాయిపల్లవి బడగ తెగ అమ్మాయా? అదే సంప్రదాయం లో చెల్లి పెళ్లి
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. బడగా తెగకు చెందిన సాయి పల్లవి కుటుంబం… కాస్త భిన్నంగా ఈ వివాహ వేడుకను నిర్వహించింది. అసలు ఈ వివాహం ఎలా జరుగుతుంది ఏంటీ అనేది చూద్దాం.
తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే ఈ తెగ వివాహానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లి సంబంధం చూసే దగ్గరి నుంచి కూడా అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి ఇక్కడ. పెళ్లి సంబంధం ఓకే చేయడానికి అమ్మాయి ఇంటికి పంపి అన్ని విషయాలు మాట్లాడుకుని… అబ్బాయికి అమ్మాయి నచ్చితే… అమ్మాయి కుడి చేతిని పట్టుకుంటాడు. అక్కడి నుంచి ఇక పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. దానికి కూడా ఒక మంచి ముహూర్తం చూసి ఘనంగా నిర్వహిస్తారు. ముహూర్తం రోజున… పెళ్లి కొడుకు తరుపు నుంచి ఐదుగురు సాయంత్రం సమయంలో అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న గ్రామస్థుల సమక్షంలో చర్చిస్తారు.
కాళ్లు, నోటిని శుభ్రం చేసుకుని అమ్మాయి ఇంట్లోకి అడుగు పెడతారు. లోపలి వెళ్ళిన తర్వాత… మంచి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు తాగాలి అంటే అమ్మాయికి సంబంధం ఓకే అయితే… తాగమని చెప్తుంది. అమ్మాయి ఓకే చెప్తే… ‘ఉంగరమణి’ అని పిలిచే ఒక సాంప్రదాయ హారాన్ని… పెళ్లికొడుకు ఇంట్లో పెద్ద వయసున్న మహిళ పెళ్లి కూతురు మెడలో వేస్తారు. ఆ తర్వాత అబ్బాయి తరుపున వ్యక్తి… 200 రూపాయల డబ్బుని కాయిన్స్ రూపంలో అమ్మాయికి ఇస్తారు. ఇక పెళ్లి రోజుకి ముందు… వరుడి తరుపున మరోసారి అయిదురు వెళ్లి అక్కడే ఉంటారు.
వాళ్ళు ఒకరోజు అక్కడ నిద్ర చేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకువెళ్తారు. పెళ్లి కూతురు ఇంటి దగ్గర… పెళ్లి కూతురి కాళ్ళు అత్తగారు కడుగుతారు. ఆ తర్వాత వెండితో చేసిన బడగ ఆభరణం ‘మలై మణి’ని అమ్మాయి కట్టుకుంటుంది.
సాధారణంగా హిందువుల పెళ్ళిళ్ళు అన్నీ… వధువు ఇంట్లో జరిగితే ఇక్కడ మాత్రం వరుడి ఇంట్లో జరుగుతాయి. వరుడి తరుపున… వివాహ ఏర్పాట్లు, పెళ్లి తర్వాత ఏర్పాటు చేసే భోజనాన్ని మదువే హిట్టు అని పిలుస్తారు. పెళ్లి కూతురు తరపు వారు ఉదయాన్నే వరుడి ఇంటికి చేరుకుని… అందరూ కలిసి… వారి గ్రామ ప్రజలతో కలిసి … “తల్లి కటుదో” అనే వేడుకను స్థానిక దేవాలయంలో నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అరటిపండు, పాలతో చేసిన ఒక వంటకాన్ని వధువుకు మాత్రమే తినిపించి బడగా నృత్యం చేస్తారట. ఆ వంటను “కచ్చు గంగువ” అని పిలుస్తారు.
వధువు… ఆమె తల్లి తండ్రులు తిన్న తర్వాత ఆ ప్లేట్ ని సాంప్రదాయం ప్రకారం ఇంటి ముందు కడగాలి. ఆ తర్వాత పెళ్లి కూతురు తన అయిదుగురు అక్కా చెల్లెళ్ళతో కలిసి… ఒక నది దగ్గరకు వెళ్లి స్వచ్చమైన నీళ్ళను తీసుకు రావాల్సి ఉంటుంది. అంటే కోడలు… ఇంట్లోకి మంచి మనసుతో వస్తుంది అని చెప్పే ఉద్దేశం. ఇంటికి వచ్చిన తర్వాత… రెండు కుటుంబాలకు చెందిన పూజారులు 11 మంది వరుసగా కూర్చుంటారు. వీళ్ళకు గొనె సంచులు మాత్రమే వేసి కూర్చోబెడతారు. వాళ్ళ ముందు “కణిక్కై” అనే రూపాయి 25 పైసల విలువ చేస్తే ఒక వస్తువు పెడతారు. పెళ్లి కొడుకు, కూతురు ఇద్దరూ ఒకే సమయంలో వారి పాదాలకు నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది. వారి కాళ్ళను కడగాల్సి ఉంటుంది. ఇలా బడగా తెగ పెళ్లిని చాలా ఘనంగా సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంది. మన దగ్గర ఇలాంటి తెగలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.