హిందీ అంటే సమంతాకు భయమా…? ఎందుకు మాట్లాడదు…?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కుర్ర కారు మైండ్ పోగొట్టిన సమంతా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారుతోంది. అక్కడి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2024 | 08:07 PMLast Updated on: Oct 22, 2024 | 8:07 PM

Is Samantha Afraid Of Hindi Why Doesnt She Speak

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కుర్ర కారు మైండ్ పోగొట్టిన సమంతా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారుతోంది. అక్కడి సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వెబ్ సీరీస్ లు కూడా చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. మొత్తం రెండు వెబ్ సీరీస్ లు చేసిన సమంతా… త్వరలోనే మరో వెబ్ సీరీస్ కి సైన్ చేయనుందని టాక్. టాలీవుడ్ లో ఇప్పుడు సమంతా మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఇటీవల అలియా భట్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చిన ఆమెను చూడటానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా రావడం విశేషం.

ప్రస్తుతం సమంత, వరుణ్ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌ : హనీ బన్ని’ బాలీవుడ్ లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది ఈ వెబ్ సీరీస్. దీనితో ఈ టీం ప్రమోషన్స్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సిరీస్‌ గురించి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంటుంది. తాజాగా సమంత, ధావన్తో పాటుగా సిరీస్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఓ ఆంగ్ల మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

ఈ సిరీస్‌లో హీరోయిన్గా మొదట సమంతను అనుకోలేదని దర్శకుడు చెప్పగా… ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ సమయంలో సిటాడెల్‌ స్క్రిప్ట్‌ దశలోనే ఉందని తెలిపారు. అందుకే మేము సమంతకు దీని గురించి ఏమీ చెప్పలేదని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ పూర్తవ్వగానే హీరోగా వరుణ్‌ను తీసుకున్నామన్నారు. హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలని కాస్త ఆలోచించామని… ఎందుకంటే వరుణ్ హిందీ బాగా మాట్లాడతాడు, అందుకే హీరోయిన్ కూడా హిందీ మాట్లాడే వారైతేనే బాగుంటుందని అనుకున్నామని వివరించాడు.

ది ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంతకు హిందీ రాదని… ఆమె మాట్లాడలేదని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అందుకే ఆమెను కాకుండా ఇంకొకరిని తీసుకోవాలని అనుకున్నామన్నాడు. అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయానని… అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతుందో అర్థం కాలేదన్నాడు. దీంతో వెంటనే ఆమెతోనే సిరీస్‌ చేయాలని భావించా అని అసలు విషయం చెప్పాడు. ఈ కామెంట్స్పై సమంత స్పందించింది. సిటాడెల్‌లో నా(హనీ) పాత్రకు హిందీ బాగా వచ్చు అని… ఈ విషయాన్ని మీరు గుర్తించలేదని సీక్రెట్ బయటపెట్టింది. ఉచ్చారణలో తప్పులు వస్తాయన్న భయంతో నేను వేదికలపై హిందీ మాట్లాడనని క్లారిటీ ఇచ్చింది సమంత.