సమంత రెండో పెళ్లి నిజమేనా.. కాబోయే శ్రీవారితో తిరుమల శ్రీవారిని దర్శించుకుందా..?

సమంత రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న వార్త ఇది. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా తిరుమలకు వచ్చిన సమంత..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 03:55 PMLast Updated on: Apr 21, 2025 | 3:55 PM

Is Samanthas Second Marriage Real Did She Visit Tirumala Lord Srivaru With Her Future Husband

సమంత రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న వార్త ఇది. దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా తిరుమలకు వచ్చిన సమంత.. ఆమెతో పాటు మరొకరిని కూడా తీసుకొచ్చింది. దాంతో ఆ వచ్చిన వ్యక్తితో సమంతకు ఏదో రిలేషన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినా సినిమా ఇండస్ట్రీలో ఒక రిలేషన్ కు ప్యాకప్ చెప్పినంత సేపు పట్టదు.. మరో రిలేషన్ కు ప్యాచప్ చెప్పడానికి..! ఓవైపు మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకుంటూనే.. మరోవైపు మనసులు కలిసాయంటూ మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోతున్నారు. హీరోలు కానీ.. హీరోయిన్లు కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా రిలేషన్ బ్రేకప్ చెప్పి.. ఇమ్మీడియట్ గా ఇంకొకరితో ప్యాచప్ అవుతున్నారు. కావాలంటే నాగ చైతన్యనే తీసుకోండి.. సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మూడేళ్లు సింగిల్ గా ఉన్న ఈయన.. ఈ మధ్యే శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్నాడు.

ఈ ఇద్దరి పెళ్లి డిసెంబర్ లో ఘనంగా జరిగింది. చైతు మాత్రమే కాదు ఆయన కంటే ముందు చాలా మంది విడాకులు తీసుకున్నారు.. రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సమంత విషయంలో కూడా ఇదే జరుగుతుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక బాలీవుడ్ దర్శకుడుతో సమంత కొన్ని రోజులుగా ప్రేమలో ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు రాజ్ నిడుమూరు. సమంతతో ఫ్యామిలీ మ్యాన్ 2, సీటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లు తీసిన దర్శకత్వంలో ఒకరు ఈ రాజ్. ఇంకో దర్శకుడు పేరు డీకే. ప్రస్తుతం రాజ్ నిడుమూరుతో సమంత డేటింగ్ చేస్తుంది అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆ దర్శకుడితోనే కలిసి కనిపిస్తుంది సమంత. కొన్ని రోజుల కింద ఒక ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో రాజ్ నిడుమూరుతో కనిపించింది సమంత. అప్పుడే ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా రాస్కొచ్చింది. ఆ తర్వాత పికిల్ బాల్ అనే స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా కలిసే కనిపించారు ఈ ఇద్దరు. దాంతో వీళ్ళిద్దరి రిలేషన్ మీద ఇంకాస్త కన్ఫర్మేషన్ వచ్చింది. మొన్నామధ్య ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన పార్టీలో కూడా సమంత, రాజ్ జంటగా కనిపించారు.

పైగా ఇద్దరూ పక్కపక్కనే ఉన్నారు. దాంతో కచ్చితంగా ఏదో నడుస్తుంది అంటూ ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అన్నింటికీ మించి సమంత బాలీవుడ్లో పాతుకు పోవడానికి బాగా హెల్ప్ చేస్తున్న డైరెక్టర్ కూడా రాజ్ నిడుమూరే. అప్పట్లో సమంత, నాగ చైతన్య మధ్య మనస్పర్ధలు రావడానికి ఒక కారణం ఈ దర్శకుడు అంటూ ప్రచారం జరిగింది. కారణం ఏదైనా వాళ్ళిద్దరూ విడిపోయారు.. చైతు ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. సమంత కూడా ఇదే దారిలో నడవాలని చూస్తుంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఒక శుభవార్త చెప్తారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు కూడా కలిసి రావడంతో కచ్చితంగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం మరింత గట్టిగా జరుగుతుంది. మే లోనే ఈ ఇద్దరి పెళ్లిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది. మరి నిజంగానే ఆ దర్శకుడితో సమంత డేటింగ్ చేస్తుందా.. ఒకవేళ ఇది నిజం కాకపోతే ఇన్ని రూమర్స్ వస్తున్నా కూడా ఎందుకు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు అనేది సస్పెన్స్.