Shraddha Kapoor: ముచ్చటగా మూడోసారి సీక్రెట్ డేటింగ్ చేస్తున్న శ్రద్ధాకపూర్..!
తాజాగా ఈ బ్యూటీపై ఓ హాట్ రూమర్ బయటకు వచ్చింది. అదే.. ముచ్చటగా మూడోసారి ఈ లేడీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆషికి2లో ఆదిత్య రాయ్ కపూర్‌తో రొమాన్స్ చేసిన శ్రద్దా ఆఫ్ స్క్రీన్‌లో కూడా ప్రేమలో పడినట్లు అప్పట్లో రుమార్స్ వచ్చాయి.
Shraddha Kapoor: ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, డేటింగ్ రుమార్స్ చాలా ఆసక్తి కలిగిస్తాయి. స్టార్ కిడ్స్ నుంచి బడా స్టార్స్ వరకు ఎవరికీ ఈ విషయంలో మినహాయింపు ఉండదు. కొంతమంది ముందే ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పేస్తే.. మరికొందరు మాత్రం రహస్యంగా ఈ విషయాన్ని మెయింటైన్ చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి రుమార్స్‌కే సెంటర్ అయింది సాహో బ్యూటీ శ్రద్దా కపూర్. ఆమె ముచ్చటగా మూడోసారి లవ్‌లో పడినట్లు తెలుస్తోంది. శ్రద్ధా కపూర్.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. 2013లో వచ్చిన ఆషికి2తో బ్లాక్ బస్టర్ కొట్టింది.
స్టార్ హీరోయిన్‌గా ఫోకస్ అయింది. తర్వాత అనేక సినిమాలు చేసిన శ్రద్దా ఈ ఏడాది తూ ఝాటి మై మక్కర్‌తో ఆడియన్స్‌ని పలకరించింది. ఈ సినిమాలో ఎవరూ ఊహించని రేంజ్ లో అందాలు ప్రదర్శించి ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీపై ఓ హాట్ రూమర్ బయటకు వచ్చింది. అదే.. ముచ్చటగా మూడోసారి ఈ లేడీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆషికి2లో ఆదిత్య రాయ్ కపూర్‌తో రొమాన్స్ చేసిన శ్రద్దా ఆఫ్ స్క్రీన్‌లో కూడా ప్రేమలో పడినట్లు అప్పట్లో రుమార్స్ వచ్చాయి. తర్వాత ప్రముఖ ఫోటో గ్రాఫర్ రోహాప్ శ్రేష్టతో కలిసి పలు పార్టీలకు హాజరైంది.
దీంతో శ్రద్దా కపూర్ పెళ్లికి రెడీ అయిందని కామెంట్ చేశారు బీటౌన్ క్రిటిక్స్. అయితే తాజాగా తు జూతీ మైన్ మక్కర్ సినిమాకి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో శ్రద్దా కపూర్ డేటింగ్ మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మరి దినిపై ఈ బ్యూటీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.