Siddu Jonnalagadda: కథ లేకుండానే సీక్వెల్ లు.. అదే దారి టిల్లూ స్క్వేర్
జొన్నల గడ్డ సిద్దూ టిల్లూ స్కైర్ తరువాత మరో సినిమా తీయబోతున్నారా..
తెలుగులో సీక్వెల్స్ కామనైపోయాయి. సినిమా హిట్ అయితే కథ రెడీగా లేకపోయినా.. పార్ట్ 2 తీస్తున్నారు. తెలుగులోకి వచ్చిన కొత్త ట్రెండ్ ఫ్రాంఛైజీ. ఇప్పటి వరకు ఎఫ్2 ఫ్రాంఛైజీ మూవీ ఎఫ్3 చూశాం. ఇంకో మూవీ కూడా ఇదే దారిలో నడుస్తోంది.
హిందీలో కిలాడీ.. గోల్‌మాల్.. హౌస్‌ఫుల్ మూవీస్ ఫ్రాంఛైజీస్‌గా ఆకట్టుకున్నాయి. తెలుగు ఫ్రాంఛైజీ ఎఫ్2తో మొదలైంది. సినిమా సూపర్‌హిట్ కావడంతో ఎఫ్3 తీశాడు. ఎఫ్2 రేంజ్‌లో ఎఫ్3 ఆడకపోయినా.. ఫ్రాంఛైజీ కంటిన్యూ చేస్తానని అనిల్ రావిపూడి తెలిపాడు. చూస్తుంటే.. డిజె టిల్లు కూడా.. ఎఫ్2 దారిలో నడుస్తోందా? అనిపిస్తోంది. సిద్దు జొన్నలగొడ్డ మేకోవర్ ముఖ్యంగా డైలాగ్ మాడ్యులేషన్‌తో సినిమాను సూపర్‌హిట్ చేశాడు.
ప్రస్తుతం సీక్వెల్‌గా టిల్లు స్క్వైర్ రూపొందుతోంది. ఇందులో హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నా.. టిజె టిల్లు భామ నేహా శెట్టి గెస్ట్ అపీరియన్స్ ఇస్తుందట. డిజె టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ అయితే.. టిల్లు స్క్వైర్‌లో అనుపమను తీసుకున్నారు. అయితే నేహా శెట్టి ఎంట్రీతో టిల్లు స్క్వైర్ క్లైమాక్స్ మలుపు తిరుగుతుందని చెబుతున్నారు. రాధిక ఎంట్రీతో పార్ట్ 3 ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమోనన్న డౌట్ వస్తోంది. టిల్లు స్క్వైర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తే.. తెలుగులో ఇదొక ఫ్రాంఛైజీ అవుతుంది. సినిమాకో అమ్మాయి ప్రేమలో పడి బకరా కావడమే టిల్లుగాడి ఫ్రాంఛైజీ అన్న మాట.