Hero Vijay: ‘లియో’.. హీరో విజయ్ చివరి చిత్రం అవుతుందా? ఆయన రిటైర్మెంట్ తీసుకోనున్నారా.. నిజాలేంటి ?
ఆ స్టార్ సినిమా రిలీజైతే కోలీవుడ్ లో కలెక్షన్ ల వర్షాలే. యూత్ అండ్ ఫామిలీ ఆడియన్స్ లో అయన క్రేజ్ అదుర్స్ అనే రేంజ్ లో ఉంటుంది. అతడే హీరో విజయ్.

Is Tamil hero Vijay Leo going to enter politics after the movie
బిగిల్, మాస్టర్, వారిసు తమిళ చిత్రాలతో అయన సక్సెస్ జర్నీ చేస్తున్నారు.విజయ్ సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయి ఇక్కడ కూడా కేక పుట్టించాయి. విజయ్ ఫాదర్ ఎస్.ఏ.చంద్రశేఖర్ డైరెక్టర్. ఈతని డైరెక్షన్ లో విజయ్ బాల నటుడిగా వెట్రి చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 1992 లో నాళాయ తీర్పు అనే సినిమాతో హీరోగా మారారు. దాదాపు 30 ఏళ్లుగా హీరో గా తన సత్తా చాటుతూ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇప్పుడు విజయ్ గురించిన ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. దళపతి ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో లియో చిత్రం చేస్తున్నారు. 2023 అక్టోబర్ 19 న ఈ సినిమా రిలీజ్ కి రెడీ కానుంది. ఈ చిత్రం తరువాత విజయ్ సినిమాల నుంచి రిటైర్ అవుతాడు అని వార్త ఫాన్స్ ని విస్తుపోయేలా చేస్తోంది. ఎందుకో కారణాలు కూడా చెప్పేస్తున్నారు. విజయ్ సినిమాలు మానేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోకుండా విజయ్ సొంత పార్టీ పెట్టేసి ఎన్నికలలో తన సత్తా చాటాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయన ఈ పొలిటికల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కూడా ఆత్రతతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి దాకా రీల్ హీరోగా ఎంటర్టైన్ చేసిన విజయ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రియల్ హీరో గా ఎలా అలరిస్తారో వేచి చూడాలి.