Game Changer : చరణ్ బర్త్ డే ట్రీట్ అదేనా
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే.. చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటనేదే ఆసక్తికరంగా మారింది.

Is that Charan's birthday treat?
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. అయితే.. చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటనేదే ఆసక్తికరంగా మారింది.
గత కొంత కాలంగా మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి. శంకర్ మార్క్ పొలిటికల్ టచ్‌తో వస్తున్న గేమ్ చేంజర్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. కానీ అనుకున్న సమయానికి మాత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోయింది గేమ్ ఛేంజర్. ఇంకా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. కానీ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్. అటు శంకర్, ఇటు దిల్ రాజు గేమ్ చేంజర్ గురించి ఏమి చెప్పడం లేదు. దీంతో.. మెగా ఫ్యాన్స్ అప్డేట్ కావాలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు. ఆశిష్ కొత్త మూవీ ‘లవ్ మీ’ (Love Me) టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో గేమ్ చేంజర్ అప్డేట్ ఇచ్చాడు.
ఈ మంత్‌లో మన రామ్ చరణ్ గారి బర్త్ డే ఉంది కదా, సో ఆ రోజు మీకోసం గేమ్ ఛేంజర్ నుండి కాంటెంట్ రాబోతుంది. అని అన్నారు దిల్ రాజు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. అయితే.. ఆ రోజు గేమ్ చేంజర్ నుంచి టీజర్ రిలీజ్ చేస్తారా? లేక సాంగ్ రిలీజ్ చేస్తారా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. గతంలో రిలీజ్ చేస్తామని చెప్పిన జరగండి సాంగ్‌నే చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అదే రోజు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. మొత్తంగా.. మార్చి 27న నుంచి గేమ్ చేంజర్ అసలు గేమ్ స్టార్ట్ కానుందనే చెప్పాలి