Srileela : శ్రీలీల అందుకే రిజెక్ట్ చేసిందా
యంగ్ బ్యూటీ (Young beauty) శ్రీలీలకు (Srileela) ఎలాంటి ఆఫర్లు వచ్చాయే అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సమతమమైంది శ్రీలీల. అయినా కూడా వచ్చిన ఆఫర్‌ను వచ్చినట్టే తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరోలే కాదు.. ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల.

Is that why Srilila rejected it?
యంగ్ బ్యూటీ (Young beauty) శ్రీలీలకు (Srileela) ఎలాంటి ఆఫర్లు వచ్చాయే అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సమతమమైంది శ్రీలీల. అయినా కూడా వచ్చిన ఆఫర్‌ను వచ్చినట్టే తన ఖాతాలో వేసుకుంది. యంగ్ హీరోలే కాదు.. ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల. ఎడాపెడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఆ హిట్ సీక్వెల్‌ను ఎందుకు రిజెక్ట్ చేసిందో? ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అసలు రీజన్ అదే అంటున్నారు.
డీజె టిల్లు సీక్వెల్ (Tillu Square Trailer) గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నగడ్డ (Sidhu sorghum) సరసన ముందుగా శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె పై కొంత షూటింగ్ కూడా చేసినట్టుగా వార్తలొచ్చాయి. కానీ మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది శ్రీలీల. ఆ తర్వాత టిల్లు కోసం జోడీని సెట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు మేకర్స్. ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ ఓకె అయింది. అయితే.. ఈ క్యూట్ బ్యూటీ కూడా వెంటనే ఎస్ చెప్పలేదు. కానీ చివరికి టిల్లుతో రొమాన్స్ చేయడానికి సై అనేసింది.
ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ట్రైలర్‌లో అనుపమను చూస్తే.. కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. లిప్ లాక్ (Lip Lock) తో రెచ్చిపోయింది అనుపమా. అందుకే.. శ్రీలీల టిల్లుగాడికి నో చెప్పి ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. లిప్ లాక్‌లు, గ్లామర్ డోస్ చేయడం ఇష్టం లేకనే.. టిల్లు స్క్వేర్ నుంచి శ్రీలీల తప్పుకుందని అంటున్నారు. మరి మార్చి 29న రానున్న టిల్లు స్క్వేర్‌లో అనుపమా ఎలా రచ్చ చేస్తుందో చూడాలి.