Sai Durga Tej : మెగా మేనల్లుడు పెళ్లికి రెడీ
మెగా ఫ్యామిలీ (Mega Family) మరో వేడుకకు రెడీ అవుతోందా? అంటే, అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యాక్సిడెంట్ నుంచి కోలుకొని వరుస సినిమాలు చేస్తున్న సాయి..

Is the mega family getting ready for another celebration? That is, the answer is yes in the industry circles.
మెగా ఫ్యామిలీ (Mega Family) మరో వేడుకకు రెడీ అవుతోందా? అంటే, అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యాక్సిడెంట్ నుంచి కోలుకొని వరుస సినిమాలు చేస్తున్న సాయి.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిన్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది.
ఆ మధ్య మెగా ప్రిన్స్ (Mega Prince) వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నట్టుగా తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష (Virupaksha), బ్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej). ఈ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. అలాగే.. తన పేరులో అమ్మ పేరును కలుపుకొని సాయి దుర్గ తేజ్‌గా కూడా పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతం హనుమాన్ నిర్మాతతో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా టాక్ ఉంది. ఇదిలా ఉండగానే.. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
సోషల్ మీడియా టాక్ ప్రకారం.. పెద్దలు చూసిన అమ్మాయినే తేజ్ పెళ్లి చేసుకోవడానికి ఓకె చెప్పాడట. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. ఆమె ఒక వ్యాపార వేత్త కూతురు అని, దాదాపుగా పెళ్లి కూడా ఫిక్స్ అయినట్టుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ గుడ్ న్యూస్‌ను మెగా ఫ్యామిలీ చెప్పనుందని అంటున్నారు. అయితే.. గతంలో తేజ్ ఒక హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు రాగా.. అదంతా పుకారేనని క్లారిటీ ఇచ్చాడు. అలాగే.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని అన్నాడు. కానీ ఇప్పుడు మరోసారి పెళ్లికి రెడీ అయ్యాడని అంటున్నారు. అయితే.. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.