Harihara Veeramallu : రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లేనా..?
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు.. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది..

Is the release date of Pawan Kalyan's movie Hari Hara Veeramallu fixed?
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు.. ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. రెండు పార్టులుగా రాబోతున్న ఈ మూవీపై నిన్న రీలీజైన టీజర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచేసిందనే చెప్పాలి.. భారీ పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ బాధ్యతలను యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. కాగా.. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్‌కి సంబంధించిన లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
నిజానికి హరిహరవీరమల్లు (Harihara Veeramallu) సినిమా షూట్ ఎప్పుడో మొదలైనప్పటికీ పవన్ పొలిటికల్ కెరీర్ కారణంగా లేట్ అవుతూ వస్తోంది. దీంతో.. ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతోన్నీ ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే.. నిన్న రిలీజ్ అయిన టీజర్‌తోనే ఆ ఎదురు చూపులకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఏడాదిలోనే వీరమల్లు రిలీల్ అవుతుంది అన్న హింట్ ఇచ్చి మరింత ఆసక్తిని పెంచేశారు. కాగా.. ఇప్పుడు ఆ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ లేటెస్ట్ బజ్ ప్రకారం.. హరిహరవీరమల్లు డిసెంబరు 20న లేదా క్రిస్మస్ రేస్ డేట్ లో రానుంది అని తెలుస్తోంది. దీంతో.. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో.. పవన్ ఫ్యాన్స పండగ చేసుకుంటున్నారు. అయితే.. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
హరిహరవీరమల్లు మూవీని 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత తోట తరణి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. పవర్ స్టార్ అభిమానులకు ఐ ఫీస్ట్ ఇచ్చేలా సినిమాను తీర్చి దిద్దుతున్నారట. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి.. పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎంత భారీ సక్సెస్‌ను అందుకుంటుందో చూడాల్సిందే..