1000 కోట్ల రహస్యం.. మెల్లిగా బయటికి వచ్చేస్తోందా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఏం కథ చెప్పి రాజమౌళి ఇంకే సినిమా తీస్తున్నాడు..? ఎందుకంటే సడన్ గా ఈ సినిమా టీం షూటింగ్ లొకేషన్ ఒడిషాకు మారింది. అక్కడ కొండలు గుట్టలు, గుడులు ఇవే లొకేషన్స్ లో షూటింగ్ అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 07:30 PMLast Updated on: Mar 06, 2025 | 7:30 PM

Is The Secret Of 1000 Crores Slowly Coming Out

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఏం కథ చెప్పి రాజమౌళి ఇంకే సినిమా తీస్తున్నాడు..? ఎందుకంటే సడన్ గా ఈ సినిమా టీం షూటింగ్ లొకేషన్ ఒడిషాకు మారింది. అక్కడ కొండలు గుట్టలు, గుడులు ఇవే లొకేషన్స్ లో షూటింగ్ అంటున్నారు. అంతకంటే విచిత్రం ఏంటంటే ఫిల్మ్ టీం వేసిన ఒక సెట్లు.. అచ్చం ఇది ఒకప్పుడు కాశీ ఇలానే ఉండేదనేలా ఉందంటున్నారు. అసలు మూవీ గురించి ఏది లీక్ కాకుండా రాజమౌళి తెగ కష్టపడుతున్నాడు. కాని సినిమా లో హీరో లుక్ నుంచి ఈ మూవీకోసం వేసిన సెట్ వరకు ఒకటి తర్వాత ఒకటి లీకౌతూనే ఉంది. లీకులకు మించి వాటి మీద రివ్యూలు, కామెంట్లతో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అందుకే సీక్రెట్ గా సినిమా తీసేకంటే, ప్రెస్ మీట్ పెట్టి జనాలకు బేసిక్ స్టోరీలైన్ చెప్పాలనుకుంటున్నాడా? అవాతార్ డైరెక్టర్ ని పిలిచి ఏప్రిల్ లో ప్రెస్ మీట్ పెట్టి, అక్కడ కథ విషయంలో, స్టార్స్ విషయంలో కుండబద్దలు కొట్టబోతున్నాడా? ఇంతకి అంతులేని కథగా మారిన ఈ సినిమా లీకేజీలకు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది? హావేలుక్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌలి కాంబినేసన్ లోతెరకెక్కే సినిమా వర్కింగ్ టైటిల్ సూపర్ గోల్డ్ లేదంటే సూపర్ మహారాజా… ఈ రెండీట్లో ఏది ఫైనల్ అవుతుందో, ఇంకో టైటిల్ ఏదైనా ఎనౌన్స్ చేస్తుందో లేదో ఇంకా తేలలేదు. కాని ఆఫ్రికా అడవుల్లో మాత్రం సినిమా షూటింగ్ అన్నారు. అక్కడే డౌట్ కొడుతోంది. ఎందుకంటే అల్యూమినియం ఫ్యాక్టరీ లోషూటింగ్ తర్వాత కెన్యాకి ఫిల్మ్ టీం బయలుదేరుతుందన్నారు. కాని ఒడిషానే సెకండ్ షెడ్యూల్ కి డెస్టినేషన్ గా మారింది. ఇది చాలదని ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ ఇమేజులు నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఆ సెట్ చూస్తుంటే ఒకప్పుడు కాశీ నగరం ఇలా ఉండేదని, అలాంటి కాలంలో కాశీ ఎలా ఉందో ఆ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. కాని ఇదే కాల్కీ మూవీ సీక్వెల్ కాదు.. లేదంటే భక్తి బ్యాక్ డ్రాప్ తో వస్తున్నిసినమా కాదు.

అద్భుతాల వేటలో తెలుగు మొనగాడు.. సింపుల్ గా ఈ కాన్సెప్ట్ తో మహేశ్ బాబు సినిమా తెరకెక్కుతోందని ప్రచారం ఎప్పుటి నుంచో జరుగుతోంది. అందులోనిజముందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా తేల్చాడు. కాని ఇక్కడ సమస్య అది కాదు. ఆఫ్రికాలో షూటింగ్ అన్నారు. ఆఫ్రీకా బ్యాక్ డ్రాప్ లో సినిమా అన్నారు. కాని సడన్ గా ఒడిషాకి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు…
అసలే మొన్నటికి మొన్న హీరో ఇందులో ఎలా కనిపిస్తాడా అన్న క్యూరియాసిటీని ఓ వీడియో లీకు చంపేసింది. ఇందులో కర్లీ లాంగ్ హేయిర్, తో మాసిన గెడ్డం లుక్ లో కంప్లీట్ హాలీవుడ్ హీరోలా కనిపించాడు మహేశ్ బాబు. ఈ లీకేజి తో ఏర్పడ్డ డ్యామేజినే కంట్రోల్ చేయలేకపోయిన టీం, ఇప్పుడు ఒడిసాలో ఇబ్బంది పడేలా ఉంది.

అక్కడ కొండలు గుట్టలు, గుళ్లూ గోపురాల్లో షూటింగ్ ప్లాన్ చేయటమే అసలు తలనొప్పి… ఇక్కడే స్టూడియోలో, అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి షూటింగ్ చేస్తేనే లీకులు షాకులిస్తున్నాయి. ఇక ఒడిషాలో గుళ్లూ గోపురాళ్లో షూటింగ్ చేస్తే జనాన్ని కంట్రోల్ చేస్తారా? కంటెంట్ లీకవ్వకుండా ఉంటుంది. కాకిపోతే ఇప్పటి వరకు లీకైన విషయాల్లో కాశీ ఘాట్ లాంటి సెట్, ఒడిషాలో షూటింగ్ ఇవన్నీ చూస్తే ఇండియన్ మైథాలజీకి, ఆఫ్రికా అడవుల్లో అద్భుతాలకేమైనా లింకుందా అన్న అంచానాలు పెరిగాయి.అందుకే రాజమౌళి కూడా వచ్చే నెలలో ప్రెస్ మీట్ పెట్టి, సినిమా కాన్సెప్ట్ ని, టోటల్ స్టార్ కాస్ట్ ని పరిచయం చేస్తాడట. ఈ ప్రెస్ మీట్ కి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరున్ రాక కూడా కన్ఫామ్ అయ్యిందట. సో అలా చేస్తే ఇక ఈ మూవీ మీద అనవసరపు ప్రిడిక్షన్లు, వాటివల్ల లీకేజీలు ఉండవనే క్లారిటీకి వచ్చిందట ఫిల్మ్ టీం.