ఓడియమ్మా జీవితం.. జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ ఖరీదు అన్ని వేలా..?

స్టార్ హీరోలు ఏం చేసినా కూడా చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అభిమానులు. వాళ్ల స్టైలింగ్.. లుక్స్.. మేకోవర్.. ఇలా ప్రతి విషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తుంటారు ఫ్యాన్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 12:30 PMLast Updated on: Apr 16, 2025 | 12:30 PM

Is The Shirt Worn By Jr Ntr Expensive

స్టార్ హీరోలు ఏం చేసినా కూడా చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అభిమానులు. వాళ్ల స్టైలింగ్.. లుక్స్.. మేకోవర్.. ఇలా ప్రతి విషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తుంటారు ఫ్యాన్స్. మా హీరో ఏం చేస్తున్నాడు.. ఏ సినిమాతో బిజీగా ఉన్నాడు.. కొత్త సినిమా కోసం ఎలా మారిపోతున్నాడు.. లుక్కు ఎలా ఉండబోతుంది.. ఇలా దేన్ని వదిలిపెట్టరు వాళ్లు. స్టార్ హీరోలు వేసుకునే చెప్పుల దగ్గర్నుంచి.. వాళ్ల షర్ట్, ప్యాంటు, షూస్.. చివరికి వాళ్ళు తాగే నీటి వరకు అన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే అనేది అభిమానం వెలకట్టలేనిది అని..! ఈ మధ్యే కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడే కొన్ని రోజులు షార్ట్ వెకేషన్ ఎంజాయ్ చేశాడు. అందులో భాగంగా అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ క్రమంలోనే ఆయన వేసుకున్న చొక్కా గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. షర్ట్ లో అంత ప్రత్యేకత ఏముంది.. దాని గురించి సోషల్ మీడియాలో అంత చర్చ ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు. కానీ అక్కడ తారక్ వేసుకున్న చొక్కా ఖరీదు ప్రత్యేక చర్చకు దారితీస్తుంది. అందుకే ఈ షర్ట్ గురించి సోషల్ మీడియాలో అంత డిస్కషన్ నడుస్తుందిప్పుడు.

ఒక షార్ట్ స్లీవ్ బటన్ టాప్ షర్ట్ వేసుకొని కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. బ్లూ, క్రీమ్, గ్రే కాంబినేషన్లో ఉన్న ఈ చొక్కా ఖరీదు అక్షరాల 90 వేల రూపాయలు. ETRO కంపెనీ ఈ చొక్కాను డిజైన్ చేసింది. తారక్ ఒంటి మీద ఈ చొక్కా కనిపించగానే వెంటనే గూగుల్ తల్లిని అడిగి మా హీరో వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంత అని సెర్చ్ చేశారు అభిమానులు. ఎవరు ఏది అడిగినా వెంటనే చెప్పే గూగుల్ తల్లి జూనియర్ ఎన్టీఆర్ చొక్కా ఖరీదు కూడా వెంటనే చెప్పేసింది. ఆ రేటు చూసిన తర్వాత అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. 90 వేల రూపాయల షర్టు ఏంటి స్వామి అంటూ సోషల్ మీడియాలో దీని గురించి స్పెషల్ డిస్కషన్స్ పెడుతున్నారు తారక్ అభిమానులు. ఈ మధ్య ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎక్కడికి వచ్చిన మోస్ట్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో కూడా తారక్ తాగిన వాటర్ బాటిల్ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా ఆయన తాగిన ఆ మినరల్ వాటర్ బాటిల్ లీటర్ ఖరీదు దాదాపు 1800 రూపాయలు.

స్టార్ హీరోలు, చాలామంది సెలబ్రిటీస్ తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఈ వాటర్ తాగుతారు. అలాగే ఎన్టీఆర్ దగ్గర వాచ్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న లేటెస్ట్ వాచ్ ఖరీదు దాదాపు కోటి 18 లక్షలు. ఇలా ప్రతి విషయంలోనూ బ్రాండ్ ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అవి చూసి ఫాన్స్ కూడా తమ హీరో గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈయన లైనప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత డ్రాగన్ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. ఆ వెంటనే దేవర 2 కథతో కొరటాల శివ సిద్ధంగా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత నెల్సన్ సినిమా ఉండబోతుంది. ఇలా రాబోయే రెండు మూడేళ్లకు సరిపోయి క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాడు జూనియర్. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు కమర్షియల్ యాడ్స్.. ఇంకొకవైపు ఫ్యామిలీ టైం అని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు తారక్.