ఇంతకన్నా ఘోరం ఉందా..? మెగా వరస్ట్ సినిమాల లిస్ట్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి, గ్లోబల్ గా మెగా బాధుడు తప్పట్లేదు. గేమ్ ఛేంజర్ కుమ్మేస్తుందనకుంటే కూలబడింది. గేమ్ జామ్ అయ్యింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ని రామ్ చరణ్ మూటకట్టుకున్నట్టైంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి, గ్లోబల్ గా మెగా బాధుడు తప్పట్లేదు. గేమ్ ఛేంజర్ కుమ్మేస్తుందనకుంటే కూలబడింది. గేమ్ జామ్ అయ్యింది. కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ని రామ్ చరణ్ మూటకట్టుకున్నట్టైంది. విచిత్రం ఏంటంటే తన తోటి హీరో ఎన్టీఆర్ దేవర హిట్ తో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. గ్లోబల్ స్టార్ మాత్రం గ్లోబల్ గా రాజమౌలి సెంటిమెంట్ కే కాదు, శంకర్ ట్రీట్ మెంట్ కి కూడా బలయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తంటే, చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాపులైన ఆరేంజ్, తుఫాన్ తో కూడా గేమ్ ఛేంజర్ ని పోల్చట్లేదు. అంటే మెగా పవర్ స్టార్ ఫెల్యూర్స్ లిస్ట్ తీస్తే, అందులో ఆరేంజ్, తుఫాన్, తర్వాత ప్లేస్ లోనే గేమ్ ఛేంజర్ ఉంటుందా? అంత ఘోరంగా సినిమాకు సెండాఫ్ ఇస్తున్నారా? ఆడియన్స్ తో ఆడుకుంటే, ఎలాంటి స్టార్ గేమ్ అయినా ఛేంజ్ అవ్వాల్సిందేనా? ఇంత భయంకరంగా గేమ్ ఛేంజర్ మీద వ్యతిరేకతకు కారణం ఏంటి?
మొత్తానికి అనుకున్నంత పనైంది. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ లో బొక్కబోర్లా పడుతుందన్నారు. అలానే జరిగింది. టీజర్ టైంలోనే ఇది ఫ్లాప్ అన్నారు. పాటలు ఒక్కటంటే ఒక్కడి సరిగాలేవని తిట్టారు. కాని ట్రైలర్ బాగుండటంతో ఏమో ఏదో మిరాకిల్ జరగొచ్చనే నమ్మకాలు పెరిగాయి. కట్ చేస్తే టీజర్ టైంలో తేల్చిందే కరెక్ట్ అనంటున్నారు. మరీ రిలీజ్ అయిన రోజే మధ్యహ్నానికి సీట్లు ఖాలీగా ఉండటంమేంటి?
థియేటర్స్ లో దోమలు ఈగలు కొట్టుకునే పరిస్థితి రెండో రోజుకే వచ్చిందా? ఏదో యాంటీ ఫ్యాన్స్ చేసే నెగెటీవ్ ప్రచారమా అంటే అదీ లేదు. అసలు చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లిస్ట్ తీస్తే అందులో గేమ్ ఛేంజర్ మొదటి స్థానం లో ఉండొచ్చంటున్నారు
శంకర్ భారతీయుుడ 2 వచ్చినప్పుడు అంతా డిసైడ్ అయ్యారు, గేమ్ ఛేంజర్ ప్లాపని… శంకర్ లో సరుకైపోయింది కాబట్టే, తనీ సినిమాలను తానే కాపీ కొడుతున్నారన్నారు. అది కూడా తనకి చేతకావట్లేదని విమర్శిస్తున్నారు
కనీసం చరణ్ ఫ్లాప్స్ మూవీలైన ఆరెంజ్, తూఫాన్ లో కథైనా ఉంది. కాసేపు కూర్చుని మనసారా క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది. కానీ గేమ్ ఛేంజర్ ని తిట్టుకుంటూ కూడా చూడలేం అంటున్నారు. ఒకటి రెండు ఫైట్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప సినిమాలో ఎమోషన్ లేదు, సెన్సేషన్ లేదు. అసలు కదిలించే కథలేదు.. ఇది గేమ్ ఛేంజర్ టాక్ లో వచ్చిన మార్పు
నిజంగా కర్మ కొన్ని సార్లు మామూలుగా తగులుకోదంటారు… అది గేమ్ ఛేంజర్ విషయంలో మరోసారి ప్రూవ్ అయినట్టుంది. ఎందుకంటే పుష్ప2 సంధ్యా థియేటర్ ఎపిసోడ్ వల్ల బన్నీ బుక్కయ్యాడు. కట్ చేస్తే గేమ్ ఛేంజర్ ఈవెంట్ టైంలో చనిపోయిన ఇద్దరి ఫ్యాన్స్ వల్ల, వీళ్లకు అది తిరిగి కొట్టింది
కట్ చేస్తే ఇప్పుడు మెగా హీరోలని, మరీ ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ని అల్లు ఆర్మీ గట్టిగా వేసుకుంటోంది. కసితీరా కామెంట్లు, యూట్యూబ్ లో ట్రోలింగ్స్ పెంచారు. ఛాన్స్ దొరికిందని పంచులతో బౌన్స్ లు విసురుతున్నారు. అసలే రాజమౌళి సెంటిమెంట్ కి ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండూ బలయ్యాయని చరణ్ ఫ్యాన్స్ బాధపడుతుంటే, ఇటు అల్లు ఆర్మీ, అటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తగులుకున్నారు. దేవరతో పోలికా అంటూ మెలికలు పెడుతున్నారు.