పుష్ప లేట్ వెనుక ఇంత భయం ఉందా…?
టాలీవుడ్ జనాలు పుష్ప సినిమా కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి పోస్ట్ పోన్ చేయవచ్చని లేదా సంక్రాంతి లేదంటే శివరాత్రి సమయానికి విడుదల చేయవచ్చనే వార్తలు ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు.
టాలీవుడ్ జనాలు పుష్ప సినిమా కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి పోస్ట్ పోన్ చేయవచ్చని లేదా సంక్రాంతి లేదంటే శివరాత్రి సమయానికి విడుదల చేయవచ్చనే వార్తలు ఫ్యాన్స్ కి అసలు నచ్చడం లేదు. బాహుబలి పార్ట్ 2 లాంటి సినిమాకే రెండేళ్ళు పడితే ఈ సినిమా ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమయంలో హీరో, డైరెక్టర్ ఇద్దరూ విదేశీ పర్యటనలకు వెళ్ళారు. దీనితో సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అయింది.
త్వరలోనే షూటింగ్ అంటూ చెప్తున్నా దానిపై స్పష్టంగా క్లారిటీ మాత్రం రావడం లేదు. అయితే ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా భయపడుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దాని వెనుక పెద్ద కారణమే ఉందని టాక్. అల్లు అర్జున్ ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా అర్ధమవుతోంది. అది ఫ్యాన్స్ కు కూడా పాకింది.
అల్లు అర్జున్ పేరు వింటేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడే పరిస్థితి. అందుకే ఇప్పుడు పుష్ప సినిమాను విడుదల చేయాలంటే కంగారు పడిపోతున్నాడు దర్శకుడు సుకుమార్. ఏ మాత్రం తేడా వచ్చినా సరే తనను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారని ఆ ప్రభావం సినిమా వసూళ్ళ మీద భారీగా పడుతుందని కంగారులో ఉన్నారట. అటు అల్లు అర్జున్ కాస్త దూకుడుగానే ఉన్నా… ప్రతీ సీన్ ను విమర్శలు రాకుండా షూట్ చేయాలని సుకుమార్ జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటి వరకు షూట్ చేసిన సీన్స్ ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నాడట లెక్కల మాస్టారు. అందుకనే సినిమా మరింత ఆలస్యం అవుతోందని, పోతే రెండు మూడు నెలలు… వస్తే మంచి సినిమా. అందుకే పుష్ప 2 విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా అడుగులు వేస్తున్నాడు సుక్కు.