venkatesh 76 : ‘వెంకటేష్ 76 ‘ ప్రాజెక్టు వెనుక ఇంత కథ ఉందా?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తన కెరీర్‌లో తెరకెక్కిన 75వ సినిమా 'సైంధవ్' (Saindhav) మూవీ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు తన 76వ ప్రాజెక్టును ఎలా అయినా హిట్ కొట్టాలని వెంకీ కసిగా ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 10:09 AMLast Updated on: Mar 23, 2024 | 10:09 AM

Is There Such A Story Behind The Venkatesh 76 Project

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తన కెరీర్‌లో తెరకెక్కిన 75వ సినిమా ‘సైంధవ్’ (Saindhav) మూవీ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు తన 76వ ప్రాజెక్టును ఎలా అయినా హిట్ కొట్టాలని వెంకీ కసిగా ఉన్నాడు. తనకు ఆల్రెడీ ఎఫ్ 2 (F2), ఎఫ్ 3 వంటి హిట్స్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ల్ వర్క్ కూడా పూర్తి చేసాడు. ఈ మూవీ మే నెలాఖరు లేదా జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది..

కాగా.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. వెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీంతో.. అనిల్ రావిపూడి ఈ మూవీని ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. దాదాపు ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ టైపులో ఈ సినిమా ఉండబోతుందట. ఇందులో ఒక హీరోయిన్‌గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకోవాలా అన్న విషయంపై ఆలోచన చేస్త్తున్నాడట.. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్త పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.. దీంతో.. మరోసారి వెంకీ తన కామెడీతో అదర కొట్టబోతున్నాడంటూ ప్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..

ఇక… ఈ ‘వెంకటేష్ 76’ (‘Venkatesh 76’) ప్రాజెక్ట్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ నడిచినట్టు టాక్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు.. ఈ కథని ముందుగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించించారట. ‘విశ్వంభర’ వంటి ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తూ బిజీగా చిరు.. ఈ మూవీపై పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదట.. దీంతో.. చిరు నో చెప్పడంతో అదే కథని వెంకటేష్ కి వినిపించి ఓకే చేయించుకున్నారు అనిల్ రావిపూడి, దిల్ రాజు..లు..! గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma wakitlo sirimalle tree) ‘ఎఫ్ 2 ‘ ‘ఎఫ్ 3 ‘ వంటి సూపర్ హిట్ చిత్రాలు దిల్ రాజు బ్యానర్లో చేశారు వెంకటేష్. అయితే అవి మల్టీస్టారర్ మూవీస్ కాగా.. ఇప్పుడు చేయబోయేది సోలో హీరో ప్రాజెక్టు అని తెలుస్తుంది.వెంకటేష్.. ఇపుడు అనిల్ రావిపూడితో చేయబోతున్న సినిమాతో మళ్లీ హీరోగా బ్యాక్ బౌన్స్ అవుతాడా ? లేదా అనేది చూడాలి.