Prabhas : అలా ప్రమోట్ చేయడం వెనక రీజన్‌ ఇదేనా..?

టాలీవుడ్‌(Tollywood) లో హీరోల్లో ప్రభాస్‌ (Prabhas) కు ఉన్న క్రేజే వేరు.. ఇక.. తన గురించి ఎవర్ని అడిగినా చెప్పేది ఒక్కటే.. డార్లింగ్ (Darling) అని.. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం, వ్యక్తిత్వం ఇండస్ట్రీలోని వ్యక్తులనే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. డార్లింగ్ వ్యక్తిత్వం, పాజిటివ్‌నెస్ వరల్డ్‌ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 10:03 AMLast Updated on: Feb 29, 2024 | 10:03 AM

Is This The Reason Behind Promoting Like That

 

 

 

టాలీవుడ్‌(Tollywood) లో హీరోల్లో ప్రభాస్‌ (Prabhas) కు ఉన్న క్రేజే వేరు.. ఇక.. తన గురించి ఎవర్ని అడిగినా చెప్పేది ఒక్కటే.. డార్లింగ్ (Darling) అని.. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం, వ్యక్తిత్వం ఇండస్ట్రీలోని వ్యక్తులనే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌ను కూడా అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. డార్లింగ్ వ్యక్తిత్వం, పాజిటివ్‌నెస్ వరల్డ్‌ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది.. అయితే.. ప్రభాస్‌లోని మరో యాంగిల్‌ కూడా బాగా ప్రొజెక్ట్ అయ్యింది. అదే తన బద్ధకం.. డార్లింగ్‌తో చాలా సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు దీనిపై అప్పుడప్పుడూ సరదాగా సెటైర్లు వేస్తూ ఉంటారు.. బాహుబలి (Bahubali) టీమ్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌కు వెళ్లిన సందర్భంలో రాజమౌళి(Rajamouli), రానా ఇదే విషయంపై సరదాగా సెటైర్లు వేశారు.. ప్రభాస్ కూడా తనకు బద్దకంగా ఉండడమే ఇష్టమంటూ నవ్వుతూ చెప్పాడు.. దీంతో.. ప్రభాస్‌కు బద్దకమన్న విషయం వైరల్‌ అయిపోయింది..

అయితే.. సినిమాల పరంగా చూస్తే ప్రభాస్‌కు నిజంగా బద్దకం ఉందా అన్న అనుమానం కలగకమానదు.. నిజానికి ప్రభాస్ నటిస్తున్న సినిమాల లైనప్‌ చూస్తే.. ప్రభాస్‌కు బద్దకం అని ఎందుకు ప్రయోట్ చేస్తున్నారా అన్న అనుమానం కలగకమానదు.. నిజానికి సలార్ భారీ హిట్‌ తర్వాత.. ప్రభాస్‌ చేస్తున్న సినిమాల సంఖ్య చాంతాడంత పెరిగిపోయింది. ఒక్క ప్రభాస్‌ పేరు మీదనే రెండు మూడు వందల కోట్ల బిజినెస్‌ నడవబోతోంది. ఎన్ని సంవత్సరాలైనా ప్రభాస్‌ కోసం వెయిట్ చేసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఏ హీరో లేనంత బిజీగా ప్రభాస్ ఉన్నాడు.. అందులోనూ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.

ఇక.. తన ప్రతి సినిమా కోసం ప్రభాస్ ఎంతో ప్రిపేర్ అవుతున్నాడు.. విదేశాల్లో ట్రైనింగ్‌లు తీసుకుంటున్నాడు.. తన పాత్రకు తగ్గట్లుగా మేకోవర్ అవుతున్నాడు.. రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఇప్పటికే 24 సినిమాలు పూర్తి చేసాడు.. మ‌రో ఐదు చిత్రాలు లైన్ లో ఉన్నాయి. క‌ల్కీ (Kalki) ‘..’రాజాసాబ్’ (Rajasab)..’స‌లార్’ (Salar) మూడు సినిమా షూటింగ్ ల‌కు ఒకేసారి హాజ‌రైన సంద‌ర్భాలున్నాయి. అలాగే మంచు విష్ణు న‌టిస్తోన్న ‘క‌న్నప్ప’ లో శివుడి పాత్ర పోసిస్తున్నాడు. త్వరలో సలార్‌-2 కూడా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.. అలాగే సెప్టెంబ‌ర్ నుంచి ‘స్పిరిట్’ కూడా ప‌ట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది.. మ‌రోవైపు రీసెంట్ గా హ‌ను రాఘ‌వపూడితో ఏకంగా ఓ వ‌ర‌ల్డ్ వార్ సినిమా చేయ‌డానికి క‌మిట్ అయిన‌ట్లు ప్రచారం సాగుతుంది. మరి.. ఇంతగా గ్యాప్‌ కూడా లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న ప్రభాస్‌కు నిజంగా బద్ధకమేనా..? అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.