Project K: ప్రాజెక్ట్‌-కే టైటిల్‌ ఇదేనా.. ఈ నెలలోనే రివీల్..!

సైన్స్‌ ఫిక్షనల్‌, టైం ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్‌ చేశారు. ఈ ప్రమోషన్స్‌లోనే ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇస్తామంటున్నారు మేకర్స్‌. ఈ నెల 20న నిర్వహించబోతున్న ఓ ఈవెంట్‌లో ప్రాజెక్ట్‌-కే సినిమా టైటిల్‌ రివీల్‌ చేయబోతున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2023 | 11:01 AMLast Updated on: Jul 10, 2023 | 11:01 AM

Is This The Title Of Prabhas Project K It Will Be Revealed Soon

Project K: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్‌-కే మీద ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్‌ సినిమా రివర్స్‌ కావడంతో.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు ప్రాజెక్ట్‌-కే ఒక్కటే మార్గం అని ఫీలౌతున్నారు. సైన్స్‌ ఫిక్షనల్‌, టైం ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్‌ చేశారు.

ఈ ప్రమోషన్స్‌లోనే ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇస్తామంటున్నారు మేకర్స్‌. ఈ నెల 20న నిర్వహించబోతున్న ఓ ఈవెంట్‌లో ప్రాజెక్ట్‌-కే సినిమా టైటిల్‌ రివీల్‌ చేయబోతున్నారట. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్‌ కే లో కే అంటే కల్కీ అని, కర్ణ అని టాక్‌ నడిచింది. కానీ కే అంటే కాలచక్ర అని ఇప్పుడు టాక్‌ నడుస్తోంది. సినిమా స్టోరీ కూడా టైం ట్రావెల్‌ కథ కావడంతో ఈ సినిమాకు కాలచక్ర అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారట. ఇదే టైటిల్‌ను త్వరలోనే రివీల్‌ చేస్తారనే టాక్‌ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్‌ సినిమా టైటిల్‌ కోసం చాలా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఇదో డిఫరెంట్‌ సినిమా అంటూ నాగ్‌ అశ్విన్‌ ఇంతకు ముందే చెప్పాడు.

దైవానికి దుష్ట శక్తులకు మధ్య ఈ కాలంలో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. మార్వెల్‌ తరహాలో ఈ సినిమాలోని ఫైట్‌ సీన్స్‌ ఉండబోతున్నాయి. 2024 జనవరి 12న రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు మేకర్స్‌. ఈ ప్రమోషన్స్‌లో సినిమా గురించి వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను త్రిల్‌ చేస్తామంటున్నారు.