పవన్ కు టాలీవుడ్ భయపడుతుందా…?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వరదలు ప్రజలకు తీరాన్ని శోకాన్ని మిగిల్చాయి. వరదల తీవ్రత ఇంకా కొన్ని ప్రాంతాల్లో తగ్గకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. బుడమేరు నది విషయంలో ఇప్పుడు ఆర్మీ అధికారులు కూడా దిగి గండ్లు పూడ్చే కార్యక్రమానికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వరదలు ప్రజలకు తీరాన్ని శోకాన్ని మిగిల్చాయి. వరదల తీవ్రత ఇంకా కొన్ని ప్రాంతాల్లో తగ్గకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. బుడమేరు నది విషయంలో ఇప్పుడు ఆర్మీ అధికారులు కూడా దిగి గండ్లు పూడ్చే కార్యక్రమానికి దిగారు. ఏపీ ప్రభుత్వం కూడా బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలబడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సినిమా పరిశ్రమ మాత్రం ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అండగా నిలబడింది. కోట్ల రూపాయలను సినిమా వాళ్ళు దానం చేసారు.
నందమూరి, మెగా హీరోలు, అక్కినేని ఫ్యామిలీ, ప్రభాస్, నిర్మాతలు, ఇలా అందరూ తమకు తోచిన సాయం చేసారు. ఇక చిన్న హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా తనకు తోచిన సాయం చేసి అందరి మెప్పు పొందింది. ఆమెపై సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. గతంలో సినిమా వాళ్ళు ఎప్పుడూ ఇలా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రాష్ట్ర విభజన తర్వాత సినిమా పరిశ్రమ దగ్గరగా లేదు. తెలంగాణా ప్రభుత్వంతోనే సినిమా పెద్దలు స్నేహం చేసిన సందర్భాలు ఉన్నాయి.
కాని ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం కోసం చిత్ర సీమ మొత్తం ముందుకు వచ్చింది. దీని వెనుక బాధ్యత కంటే భయం ఎక్కువగా కనపడుతోంది అంటున్నారు జనాలు. తెలంగాణాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు రెండూ తేడా వస్తే తమను ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన శాఖ కూడా జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేశ్ వద్దనే ఉంది. గతంలో కొందరు సినిమా వాళ్ళు జగన్ ప్రభుత్వంతో ఎక్కువగా స్నేహం చేసారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు గోక్కోవద్దు అని వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని సినిమా వాళ్ళు భావించి ఉండవచ్చు. ఎప్పుడూ సాయం చేసే వాళ్ళు పక్కన పెడితే కొందరు సాయం చేసిన వాళ్ళు మాత్రం ఇదే మనసులో పెట్టుకుని చేసి ఉండవచ్చు అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు.