Vishwak Sen: మాంగళ్యం తంతునానేనా.. పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో..?

విశ్వక్ సేన్ పెళ్లి మ్యాటర్ చూస్తే, తన పెళ్లి స్పేయిన్‌లో ప్లాన్ చేశారట. సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి. ఇదీ విశ్వక్ ప్లానింగ్. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పెళ్లిని యూరప్‌లో ప్లాన్ చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 14, 2023 | 05:38 PMLast Updated on: Aug 14, 2023 | 5:38 PM

Is Vishwak Sen Getting Married What Is The Truth About Actors Post

Vishwak Sen: విశ్వక్ సేన్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదే అర్థం వచ్చేలాగా లైఫ్‌లో కొత్త ఫేజ్‌లోకి అడుగుపెట్టబోతున్నా అన్నాడు. ఫ్యామిలీ ప్యాకేజ్ రెడీ అని అర్ధం వచ్చేలా మూడు చిన్న పేరాల పోస్ట్‌తో సోషల్ మీడియాలో బాంబు పేల్చాడు. అంతా బానే ఉంది. ఇప్పుడు ఈ విషయానికి రెబల్ స్టార్ ప్రభాస్‌కి లింక్ పెరిగింది. అక్కడే కథలో చిన్న పాటి ట్విస్ట్ ఉంది. ఆ సంగతిలోకి వెళ్లే ముందు విశ్వక్ సేన్ పెళ్లి మ్యాటర్ చూస్తే, తన పెళ్లి స్పేయిన్‌లో ప్లాన్ చేశారట.

సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి. ఇదీ విశ్వక్ ప్లానింగ్. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పెళ్లిని యూరప్‌లో ప్లాన్ చేసుకున్నాడు. ఇటలీలో లావణ్య త్రిపాఠితో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ముహుర్తం కుదిరింది. డేట్ ఎనౌన్స్ చేయలేదు కాని నవంబర్‌లోనే పెళ్లని తెలుస్తోంది. మొన్న శర్వానంద్ పెళ్లైంది. ప్రభాస్ ఫ్రెండ్ రానా పెళ్లెప్పుడో అయ్యింది. ఇలా టాలీవుడ్‌లో ఉన్న బ్యాచిలర్స్ అంతా ఫ్యామిలీమ్యాన్ అయిపోతున్నారు. మరి ప్రభాస్ పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ప్రశ్నలానే ఉండిపోతోంది. పెళ్లికి ముందు ఎప్పుడు పప్పన్నం పెడతావని శర్వానంద్, రానాని అంటే తమ సీనియర్ ప్రభాస్ పెళ్లి తర్వాత అన్నారు. కాని ముందే పెళ్లి చేసుకున్నారు. సో బాలీవుడ్‌లో సల్మాన్, టాలీవుడ్‌లో ప్రభాసే ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా మిగిలిపోతున్నారు. ఐతే ప్రభాస్ తన పెళ్లి కబురు అందించేలా ఉన్నాడట.

2024లో తనకి పెల్లి గడియలు దగ్గరకొస్తున్నాయట. జర్మనీలోడెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశారట. అంటే ఇక ప్రభాస్ పెళ్లవుతుందా అంటే.. అక్కడే ట్విస్ట్ ఉంది. 2020లో ప్రబాస్ పెళ్ళి కోసం తన పెదనాన్న కృష్ణం రాజు ఓ సంబంధం చూసి 2024లో ప్రభాస్‌కి ఏదో సెంటిమెంట్‌గా కలిసొచ్చే గడియలున్నాయని జర్మనీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశాడట. ఆ ప్లానింగే ఇప్పుడు లీకైంది తప్ప, ప్రభాస్ ఆపెళ్లికి ఒప్పుకున్నాడని కాదట. ఏదేమైనా ఇండస్ట్రీలో ఏ హీరో పెళ్లైనా, ప్రభాస్ వెడ్డింగ్ బెల్స్ ఎప్పుడు మోగుతాయనే ప్రశ్నఎదురవుతూనే ఉంటోంది.