ఈరోజుల్లో ఒక హీరోయిన్ సినిమాల్లో డామినేషన్ చేయాలి అంటే గ్లామర్ కచ్చితంగా ఉండాలి. స్కిన్ షో చేస్తే మాత్రమే జనాల్లో ఆదరణ ఉంటుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ లేకపోయినా ఇప్పుడు దుమ్ము రేపుతున్నారు. జనాలు కూడా నటనకు ప్రయారిటీ ఇవ్వడంతో కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ కంటే నటనపై ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి ఎక్కువగా గ్లామర్ కంటే నటనపై ఫోకస్ పెట్టి వేరే హీరోయిన్లకు సవాల్ చేస్తుంది. దీనితో ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక గ్లామర్ పరంగా అంతా అందగత్తె కాకపోయినా ఐశ్వర్య రాజేష్ కూడా దుమ్ము రేపుతోంది. ఇటు తెలుగు అటు తమిళ సినిమాల్లో ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా వెంకటేష్ పక్కన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఆమె నటించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే వెంకటేష్ తర్వాత ఎక్కువగా స్కోప్ దొరికింది ఐశ్వర్య రాజేష్ కు మాత్రమే. గ్లామర్ పరంగా మీనాక్షి చౌదరి యూత్ ను అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ నటనతో డామినేట్ చేసింది ఐశ్వర్య. హీరో పక్కన భార్యగా, అమాయకత్వం, చదువులేని పల్లెటూరి అమ్మాయిగా కనబడుతూ.. చాలా కూల్ గా ఆమె చేసిన నటన చాలా బాగుంది. పక్కా తెలుగమ్మాయిగా వైఫ్ మెటీరియల్ గా కనిపించింది ఐశ్వర్య రాజేష్. గోదారి గట్టు మీద పాటలో గొప్పగా విజువల్స్ లేకపోయినా వెంకీ మామ లేని ఫ్రేమ్స్ లో ఈమె డామినేట్ చేసింది. డాన్స్ పరంగా కూడా ఐశ్వర్య రాజేష్ దుమ్మురేపింది. నిజానికి.. ఈ పాత్రకు ఐశ్వర్య కంటే ముందు మరో ముగ్గురు హీరోయిన్లను అడిగాడు అనిల్ రావిపూడి. నలుగురు చిన్నపిల్లల తల్లి పాత్ర అనేసరికి వాళ్ళు వెనకడుగు వేయడంతో.. ఐశ్వర్య రాజేష్ ను ఫైనల్ చేశాడు. ఈ క్యారెక్టర్ లో ఎంత వెయిట్ ఉందో గుర్తించిన ఐశ్వర్య రాజేష్ ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. వెంకటేష్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే తనకు ఎంత స్కోప్ ఉందో గుర్తించి దుమ్ము రేపింది. హీరోయిన్ అంటే గ్లామర్ అనే వాళ్లకు తన నటనతో చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించిన సరే ఆమె నటనకు అంతగా మార్కులు పడలేదు. కానీ ఐశ్వర్య రాజేష్.. వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవడం.. ప్రమోషన్స్ విషయంలో కూడా ఐశ్వర్య రాజేష్ బాగా హెల్ప్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్య రాజేష్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో ఆమె తెలుగులో మంచి ఆఫర్లు కొట్టేయవచ్చు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.[embed]https://www.youtube.com/watch?v=Hu0ZPeaCiTg[/embed]