ఐటి భయం’ మహేష్ తో జక్కన్న కొత్త అగ్రిమెంట్.. కండీషన్స్ అప్లై

ఐటీ దాడుల దెబ్బకు టాలీవుడ్ భయపడి పోతుంది. ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందో అర్థం కాక సినిమా వాళ్ళు గుండె గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 29, 2025 | 02:02 PMLast Updated on: Jan 29, 2025 | 2:02 PM

It Fear Maheshs New Agreement With Jakkanna Conditions Apply

ఐటీ దాడుల దెబ్బకు టాలీవుడ్ భయపడి పోతుంది. ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందో అర్థం కాక సినిమా వాళ్ళు గుండె గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. టాలీవుడ్ జనాలకు రీసెంట్ గా ఐటీ వాళ్ళు ఇచ్చిన షాక్ తో సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు చేయాలన్న సరే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. పుష్ప సినిమా, రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమాల హడావుడి టాలీవుడ్ను భయపెడుతుంది. ఈ సినిమాల అనౌన్స్మెంట్లే ఐటి అధికారులు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడానికి కారణం అనే ఒపీనియన్స్ వినపడుతున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలో లైన్లో ఉన్నాయి. ప్రభాస్ సినిమాలే దాదాపుగా ఏడు సినిమాలు భారీ బడ్జెట్ తో వస్తున్నాయి. ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే. దీనితో ఈ సినిమాల విషయంలో నిర్మాతలు అలాగే డైరెక్టర్లు భయపడిపోతున్నారు. ఇక లేటెస్ట్ గా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి చాలా పక్కాగా బడ్జెట్ విషయాల్లో వ్యవహరిస్తున్నట్లు టాక్. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి ఎక్కడ లీక్ కాకూడదని జాగ్రత్తగా ఉంటున్నాడు.

అనవసరమైన అనౌన్స్మెంట్లు అనవసరమైన హడావుడి.. లేనిపోని ప్రచారం వద్దని జక్కన్న జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సినిమా రిజల్ట్ పై మాత్రమే దృష్టి పెట్టాలని… కలెక్షన్లపై రికార్డులపై దృష్టి పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఇంగ్లీషు మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. సినిమా యూనిట్ తో అలాగే టెక్నీషియన్స్ తో రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను బయటకు చెప్పడానికి వీలులేదు.

దర్శక నిర్మాతలు అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసిన బయటికి చెప్పినా… భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని రాజమౌళి క్లియర్ కట్ గా చెప్పేసాడు. ముఖ్యంగా సినిమా బడ్జెట్ గురించి ఎక్కడా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇక సినిమా బడ్జెట్ కు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైనా హడావిడి చేసిన సరే వాటిపై కూడా చర్యలు తీసుకోవడానికి రాజమౌళి రెడీ అయిపోతున్నట్లు టాక్. రీసెంట్ గా జరిగిన ఐటీ దాడులు ఎఫెక్ట్ రాజమౌళి పై కూడా గట్టిగానే పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా భారీగా వసూలు చేస్తుంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. త్రిబుల్ ఆర్ సినిమా కూడా భారీగా కలెక్షన్స్ సాధించింది. దీంతో జక్కన్న పై కూడా ఐటి అధికారులు ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. అటు నిర్మాత కేఎల్ నారాయణ కూడా ఈ విషయంలో అలెర్ట్ అయ్యారు.