Mahesh Babu: మహేశ్ బాబు ఇబ్బంది పెడుతున్న హీరోయిన్.. రంగంలోకి రాజమౌళి
సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీకి ఎలా హీరోయిన్ల సమస్య వచ్చిందో, అంతకు మించే సమస్య రాజమౌళీ మూవీకి వచ్చేలా ఉంది. పూజా హెగ్డే వద్దని శ్రీలీలని తీసుకున్నాక గుంటూరు కారం మూవీకి హీరోయిన్ సమస్య తీరొచ్చు. కాని రాజమౌళి మేకింగ్ లో మార్చ్ లో మొదలయ్యే మహేశ్ బాబు మూవీకి హీరోయిన్ దొరకటం అంతతేలికకాదు.

It has become difficult to find a heroine for Mahesh Babu in Rajamouli's film
బాలీవుడ్ నుంచి హీరోయిన్లను తీసుకుందామంటే, సూటయ్యే లేడీనే దొరకట్లేదు. దీపికా పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటే, తను ఆల్రెడీ ప్రాజెక్ట్ క చేస్తోంది. కాబట్టి తనని తీసుకోవం కొత్తగా సరికొత్తగా జనాలను ఎగ్జైట్ చేయదు. సరే శ్రీదేవి కూతురుందనుకుంటే, తను కూడా ఎన్టీఆర్ మూవీ దేవరతో టాలీవుడ్ లో అడుగు పెట్టేసింది. కైరాఅద్వాని గతంలోనే మహేశ్ తో జోడీ కట్టింది. ఆలియా త్రిబుల్ ఆర్ తో ఇక్కడ పరిచయమైంది. శ్రద్ద కూడా సాహోతో ఇక్కడ మెరిసింది.
సో మహేశ్ లుక్ తగ్గ కిక్ ఇచ్చే లేడీ అయ్యుండటమే కాదు, రాజమౌళి తీసేది పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఆరేంజ్ కి తగ్గట్టు ఉండే హీరోయిన్ దొరకటం నిజంగానే కత్తి మీద సామైంది. బాలీవుడ్ ని కాదని హాలీవుడ్ హీరోయిన్లైన జెన్నిఫర్ లారెన్స్, క్రిస్టీనా స్టూవర్ట్ తీ రాజమౌళి సంప్రదించటం కొంతవరకు నిజమే కాని, వాళ్ళది స్పెషల్ రోల్ మాత్రమేనట. అది హాలీవుడ్ మార్కెటింగ్ కోసమేనని తెలుస్తోంది. అసలు మహేశ్ లవ్ ఇంట్రస్ట్ అయిన రోల్ కి మాత్రం హీరోయిన్ దొరకట్లేదు. మాజీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ని తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేశాడట రాజమౌైళి.. వర్క్ షాప్ కి టైం దగ్గర పడుతుండటంతో హీరోయిన్ల వేట కొనసాగిస్తున్నాడు జక్కన్న.